Nithya Menen Remuneration: పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడం కోసం నిత్య ఇంత త్యాగం చేసిందా

ఈమధ్యకాలంలో అప్పుడే కెరీర్ మొదలెట్టిన హీరోయిన్లు కూడా కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ గుంజుతున్నారు. వరుస ఫ్లాపులు చవిచూస్తున్న నటి దగ్గర నుంచి మంచి సక్సెస్ జోన్ లో ఉన్న హీరోయిన్ కూడా మినిమం రెండు మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోకుండా వదలడం లేదు. అలాంటిది నిత్యామీనన్ మాత్రం పవన్ కళ్యాణ్ సరసన నటించడం కోసం తన రెగ్యులర్ రెమ్యూనరేషన్ లో సగం కూడా తీసుకోలేదని తెలుస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మంచి మార్కెట్ ఉన్న నిత్యామీనన్ “భీమ్లా నాయక్” చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

నిజానికి ఈ క్యారెక్టర్ కోసం ముందు సాయిపల్లవిని అనుకున్నారు. ఆమె ఒకే చెప్పింది కూడా.. అయితే డేట్స్ ఎడ్జస్ట్ అవ్వకపోవడంతో ఆమె స్థానంలో నిత్యామీనన్ ను ఎంపిక చేసుకున్నారు. ఇలా లాస్ట్ మినిట్ లో రోల్ ఫిల్ చేయాల్సి వచ్చినప్పటికీ.. నిత్యామీనన్ కేవలం 85 లక్షల రూపాయలు మాత్రమే రెమ్యూనరేషన్ గా తీసుకొందని తెలుస్తోంది. నిజానికి నిత్య షూటింగ్ డేస్ తో సంబంధం లేకుండా కనీసం కోటిన్నర రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

ఈమధ్య కాస్త సినిమాలు తగ్గించినా ఆమె క్రేజ్ & మార్కెట్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అయితే.. పవన్ కళ్యాణ్ తో నటించడం వల్ల తన కెరీర్ మళ్ళీ రివైవ్ అవుతుంది అనే ఆలోచనతోనే నిత్యామీనన్ ఇలా సగం రెమ్యూనరేషన్ కి సినిమా చేస్తోందని అర్ధమవుతుంది. ఇకపోతే.. పవన్-నిత్యామీనన్ ల కాంబినేషన్ సాంగ్ త్వరలో విడుదలకానుంది. ఈ చిత్రంలో నిత్యామీనన్ మంచి పవర్ ఫుల్ ఉమెన్ రోల్ ప్లే చేస్తుంది.a

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus