ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో పొరపాటు చేస్తుంటారు. దానిని సరి చేసుకొని జీవనం కొనసాగించాలి. ఇందుకు సెలబ్రిటీలు అతీతులు కారు. అప్పుడప్పుడు వారు కూడా తప్పులు చేస్తుంటారు. అయితే కొంతమంది ఆ తప్పుని సర్దిచెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సోషల్ మీడియాలో అయితే చేసిన పోస్ట్ ని, కామెంట్ ని డిలీట్ చేస్తుంటారు. ఇలా మాత్రం నివేత థామస్ చేయలేదు. జెంటిల్ మ్యాన్, నిన్నుకోరి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన నివేతా థామస్ … జై లవకుశ మూవీలో ఎన్టీఆర్ పక్కన నటించి టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది.
ఈమె నిన్న శివరాత్రి సందర్భంగా అభిమానులకు పొరపాటున మకర సంక్రాంతి శుభాకాంక్షలు అని ట్వీట్ చేసింది. ఫాలోవర్స్ ఆ పొరబాటుని ఎత్తి చూపారు. దీంతో తప్పు తెలుసుకున్న నివేత వెంటనే క్షమాపణ కోరింది. అలాగే శివరాత్రి శుభాకాంక్షలు చెప్పింది. ఇంతటితో ఈ టాపిక్ ముగిసింది. విమర్శలు చేసిన వారు శాంతించారు. నివేత క్రిస్టియన్ అయినందున హిందు పండగల గురించి అవగాహన లేకపోవడంతో ఈ పొరపాటు జరిగిందని ఆమె సన్నిహితులు చెప్పారు.
ప్రస్తుతం నివేత మంచి కథల కోసం వెయిట్ చేస్తోంది.