తేల్చి చెప్పిన నిర్మాత అల్లు అరవింద్
- December 2, 2016 / 01:29 PM ISTByFilmy Focus
అభిమానుల కోరిక మేరకు స్టార్ హీరోల సినిమాలను రిలీజ్ కి ముందురోజు రాత్రి మిడ్ నైట్ షోలు వేయడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. దానికి ఇప్పుడు బెనిఫిట్ షో అని కూడా పేరు పెట్టారు. అయితే ఈ షోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సినిమాలకు కలిసి రాలేదంట. అందుకే ఈ సారీ ట్రెండ్ మార్చనున్నారు. ధృవ సినిమాకి స్పెషల్ షోలు, ప్రీమియర్ షోలు, మిడ్ నైట్ షోలు వేయకూడదని నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ ఫిక్స్ అయ్యారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీకి ఆడియో రిలీజ్ వేడుకను క్యాన్సల్ చేసిన అరవింద్.. ఇప్పుడు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే శుక్రవారం (డిసెంబర్ 9 ) ఉదయం ఉదయం ఆరు గంటల తరువాతే షోలు వేసుకోవాలని స్పష్టం చేశారు. మెగా అభిమానులు ఈ విషయాన్నీ అర్ధం చేసుకోవాలని చిత్ర మరో నిర్మాత ఎన్.వి. ప్రసాద్ వెల్లడించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ కి ఇది రీమేక్ కావడం, తొలి సారి చెర్రీ, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న ఫిల్మ్ కావడంతో దీనిని ఎప్పుడెప్పుడు చూడాలా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















