టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి చెందిన సినిమాలంటేనే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే అభిమానుల్లో హైప్ తారాస్థాయిలో ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ ఇద్దరి సినిమాల రిలీజ్ విషయంలో మాత్రం క్లారిటీ రాకపోవడం వల్ల ఫ్యాన్స్ మళ్లీ నిరాశకు గురవుతున్నారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమా విశ్వంభర(Vishwambhara). సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం చివరి దశలో వాయిదా పడింది.
అప్పటి నుంచి మే 9 తేదీపై ఊహాగానాలు మొదలయ్యాయి. డిజిటల్ డీల్స్, డిస్ట్రిబ్యూషన్ క్లారిటీ వచ్చిన తర్వాతే విడుదల తేదీ ప్రకటిస్తారని మేకర్స్ చెబుతుండడంతో, ఈ చిత్రానికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమా పరిస్థితి కూడా దాదాపు ఇదే విధంగా ఉంది. రాజకీయ బిజీషెడ్యూల్ కారణంగా ఈ సినిమా మరింత ఆలస్యమవుతోంది. ఇటీవల కొన్ని రోజులు పవన్ షూటింగ్‌కు హాజరవ్వడంతో మేకర్స్ మళ్లీ స్పీడ్ పెంచారు.
అయితే ఇంకా 12 రోజుల షూట్ మిగిలి ఉండటంతో మే 9న రిలీజ్ సాధ్యపడుతుందా? అనేదానిపై సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. మే 9న ఇప్పటికే నితిన్ (Nithiin) తమ్ముడు (Thammudu), శ్రీ విష్ణు (Sree Vishnu) సింగిల్ (Single), బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) భైరవం (Bhairavam) సినిమాలు రిలీజ్ అవుతున్నాయని టాక్. ఈ పోటీ మధ్య హరిహర వీరమల్లు రిలీజ్ చెయ్యాలంటే మరింత ప్రొమోషన్ అవసరం అవుతుంది. అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావాల్సిన అవసరం ఉంది.
అందువల్ల మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని టాక్. ఫైనల్‌గా చూస్తే, మెగా హీరోల సినిమాలపై అభిమానుల ఎదురుచూపులు మామూలుగా లేవు. కానీ విడుదల తేదీలపై స్పష్టత లేకపోవడం వల్ల వారి కంటె దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతోంది. మేకర్స్ కానీ, హీరోలు కానీ వీటిపై క్లారిటీ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే ఈ సినిమాలపై ఉన్న బజ్ కూడా తగ్గిపోవచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.