ఓటీటీలో బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఎందుకు ఆపేశారంటే..?

ఓటీటీలో వచ్చిన బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు సీజన్ – 1 గ్రాండ్ ఫినాలే చాలా అట్టహాసంగా ముగిసింది. అయితే, ఇదే స్టేజ్ పైన నాగార్జున ఈసారి ఓటీటీలో బిగ్ బాస్ ఉండదు అని, ఒకవేళ ఉన్నా నాన్ స్టాప్ ఉండదని చెప్పేశాడు. అంటే, టెలివిజన్ లో మాత్రమే బిగ్ బాస్ షోని రన్ చేయబోతున్నారన్నమాట. ఎందుకంటే, ప్రస్తుతం ఓటీటీలో వస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్ లకి మంచి డిమాండ్ ఉంటోంది. అందుకే, నాన్ స్టాప్ బిగ్ బాస్ లైవ్ చూడటం అనేది సాధ్యం కాలేదు.

అంతేకాదు, 24 గంటల పాటు బిగ్ బాస్ షోని చూసేందుకు బిగ్ బాస్ లవర్స్ ఎవ్వరూ కూడా ఇష్టపడలేదు. అందుకే, సీజన్ 1 అనేది సోసో గానే సాగింది. ముఖ్యంగా మొబైల్ ఛార్జింగ్, మొబైల్ లో డేటా అనేది అయిపోవడం వల్ల బిగ్ బాస్ లవర్స్ తీవ్ర అసంతృప్తి చెందారు. ఇక ఒకరోజు ముందుగానే లైవ్ కట్ చేయడం, ముందుగానే లైవ్ లో ఏం జరుగుతోంది అనేది సోషల్ మీడియా ద్వారా తెలిసిపోవడం వల్ల ఈ షోపై ఆసక్తి తగ్గిపోయింది.

దీనివల్ల బిగ్ బాస్ నాన్ స్టాప్ లైవ్ అనేది ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. అందుకే, ఇప్పుడు నాన్ స్టాప్ 24X7 లైవ్ ని ఆపేయబోతున్నారు. ఇక సీజన్ – 2 అనేది ఓటీటీలో వేరేవిధంగా డిజైన్ చేస్తారా ? లేదా మొత్తానికి ఓటీటీ సీజన్ ని ఆపేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం అయితే, సీజన్ – 2ని వేరే విధంగా ఆలోచించి చేస్తారు అనేది టాక్. అంతేకాదు, ఈ రియాలిటీ షోకి స్పాన్సర్స్ ని కూడా యాడ్ చేయబోతున్నారు.

ఓటీటీలో స్పాన్సర్స్ యాడ్స్ వేయాలంటే ఖచ్చితంగా యాప్ నుంచీ సహకారం కావాలి. దీనికోసం హాట్ స్టార్ సిద్ధంగా ఉండాలి. అలా అయితేనే సీజన్ – 2 ని రన్ చేయగలరని తెలుస్తోంది. మరోవైపు స్టార్ మాటివిలో బిగ్ బాస్ సీజన్ – 6కి సన్నాహాలు నడుస్తున్నాయి. టెలివిజన్ లో టెలికాస్ట్ కాబట్టి ఖచ్చితంగా స్పాన్సర్స్ కి కొదవ ఉండదు. అంతేకాదు, షో వన్ అవర్ పైన ఉంటే ఆడియన్స్ కి కూడా చూసేందుకు వీలు ఉంటుంది.

ఎవరు ఎలా గేమ్ ఆడుతున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది. అందుకే, టెలివిజన్ షో పూర్తి అయిన తర్వాత ఓటీటీని సరికొత్తగా ముస్తాబు చేస్తారని చెప్తున్నారు. అందుకే, స్టేజ్ పైన నాగార్జున ఓటీటీ నాన్ స్టాప్ లైవ్ అనేది ఇక ఉండదు అని చెప్పారు. మరి సీజన్ – 2 ని ఎలా ప్లాన్ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరం. అదీ మేటర్.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Share.