ఈ తెలుగమ్మాయి కూడా క్లిక్ అవ్వనట్టేనా..?

కెరీర్ ప్రారంభంలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ.. వచ్చిన పూజిత పొన్నాడ తరువాత పలు సినిమాల్లో కూడా నటించింది. నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన ‘తుంటరి’ చిత్రం ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన పూజిత ఆ తరువాత సుకుమార్ నిర్మాణంలో వచ్చిన ‘దర్శకుడు’ చిత్రంలో కూడా నటించింది. అప్పటివరకూ పర్వాలేదు అనిపించుకున్న ఈ అమ్మడికి ‘రంగస్థలం’ చిత్రం బాగానే కలిసొచ్చిందని చెప్పాలి. ఇక ఈ చిత్రంతో బిజీ అవుతుంది అనుకున్నారు అంతా..! అయితే ఆ తరువాత ఈమె చేసిన ‘బ్రాండ్ బాబు’ ‘రాజుగాడు’ ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ ‘సెవెన్’ ‘కల్కి’ వంటి చిత్రాలు నిరాశపరిచాయి.

అప్పటినుండీ ఈమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇప్పుడు ఈమె చేతిలో మూడు తమిళ సినిమాలున్నాయి. ఇవి క్లిక్ అయితే ఈమెకు కాస్త పెద్ద ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వీటి పైనే నమ్మకం పెట్టుకున్నట్టు ఈ అమ్మడు తెలిపింది. సుకుమార్, ఇంద్రగంటి మోహన్ కృష్ణ వంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చెయ్యాలని ఈ అమ్మడు ఆశపడుతున్నట్టు కూడా చెప్పుకొచ్చింది. అయితే ముంబై బ్యూటీస్ ఉండగా.. తెలుగమ్మాయిలను మాత్రం మన టాలీవుడ్ సినీ దర్శకనిర్మాతలు పెద్దగా పట్టించుకోరు అన్న కామెంట్స్ ఎప్పటినుండో వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పూజిత విషయంలో మరోసారి వినపడుతున్నాయి అంతే..!

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58


Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus