2013 వరకు ప్రభాస్ రేంజ్ వేరు 2017 తరువాత ప్రభాస్ రేంజ్ వేరు. ప్రభాస్ బాహుబలి సిరీస్ తో దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ ఫైవ్ లో కూడా లేని ప్రభాస్ టాప్ పోజిషన్ కి చేరుకున్నారు. వందల కోట్ల వసూళ్లు ఒక్క ప్రభాస్ తోనే సాధ్యం. అందుకే పాన్ ఇండియా మూవీ అంటే ప్రభాస్ కావలసిందే. ఎందుకంటే మిగతా హీరోలు ఎవరూ ఇంకా ఈ స్థాయికి చేరుకోలేదు. టాలీవుడ్ లో ప్రభాస్ కి మించిన స్టార్ డమ్ కలిగిన హీరోలు ఉన్నారు.
అయితే ప్రభాస్ రేంజ్ వేరు, ఆయన ఇప్పటికే మూడు పాన్ ఇండియా చిత్రాల విజయాలతో ముందంజలో ఉన్నారు. ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ కేవలం గాలివాటం అని చాలా మంది అనుకునే వారు. అది నిజం కాదని బాహుబలి విజయంలో ప్రభాస్ పాత్ర ఎంతగానో ఉందని, సాహో విజయం నిరూపించింది. బ్యాడ్ టాక్ తో కూడా సాహో హిందీలో భారీ విజయం అందుకుంది. 150 కోట్లకు పైగా వసూళ్లను సాహో హిందీ వర్షన్ రాబట్టింది.
ఆల్ ఇండియా లెవల్ లో ప్రభాస్ రేంజ్ ఏమిటో తెలిశాక ఆయన రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయికి వెళ్ళింది. ప్రస్తుతం ప్రభాస్ రెమ్యూనరేషన్ 70 కోట్లకు పైమాటే అని సమాచారం. కాగా ఈ మాత్రం రెమ్యూనరేషన్ కి చేరుకోవడం టాలీవుడ్ హీరోలకు కష్టమే అని చెప్పాలి. ఐతే వచ్చే ఏడాది ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ మరియు పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తుండగా, భారీ విజయాలు సొంతం చేసుకోని ప్రభాస్ కి ధీటుగా ఎదుగుతారేమో చూడాలి.