Ram Charan: రామ్‌చరణ్‌ లుక్‌లో శంకర్‌ మార్క్‌ లేదు.. ఇలా అయితే కష్టమే?

(Ram Charan) శంకర్‌ సినిమా అంటే కచ్చితంగా మినిమమ్‌ సర్‌ప్రైజ్‌ ఉంటుంది. లుక్‌ నుండి సినిమా ఎండింగ్‌ కార్డు వరకు ఆయన స్టైలే వేరు. లార్జర్‌ ద్యాన్‌ లైఫ్‌ సినిమాలు చేయడం ఆయనకు అలవాటు, అలాగే అలాంటి సినిమాలను అంతకుమించి అనే రేంజిలో ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో హీరోల మేకోవర్‌, హీరోయిన్ల అందం అన్నీ అదిరిపోతాయి. ఇంతగా శంకర్‌ గురించి చెప్పుకోవచ్చు. అయితే రామ్‌చరణ్‌ కొత్త సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ పోస్టర్‌లో ఈ ఫీలింగ్‌ కనిపిస్తోందా? అంటే కచ్చితంగా లేదు అనే చెప్పాలి.

శంకర్‌ తన సినిమాలకు ఇచ్చే టైటిల్‌ భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఒక్కోసారి చాలా సాదాసీదా ఉంటాయి. కానీ రామ్‌చరణ్‌ సినిమా పేరు మాత్రం అదో రకంగా ఉంది అని చెప్పాలి. టైటిల్‌ లుక్‌ కూడా ఏమంత ఆసక్తికరంగా లేదని సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ గుసగుసలాడుతున్నారు. అదేదో హాలీవుడ్ సినిమా టైటిల్‌లాగా ఇచ్చారని అంటున్నారు. మరికొందరైతే ఈ టైటిల్‌లో మాస్‌ అప్పీల్‌ లేదని చెబుతున్నారు. అయతే లుక్‌లో మాత్రం మాస్‌ అప్పీల్‌ గట్టిగానే కనిపిస్తోంది. అంతటి ఫీల్‌, కిక్‌ టైటిల్‌లో లేదు.

శంకర్‌ రీసెంట్‌ సినిమాల లుక్‌లు తీసుకుంటే.. అది చూసిన క్షణం నుండే సినిమాల మీద అంచనాలు పెంచుకునేలా ఉంటుంది. ఉదాహరణకు మొన్నీమధ్య వచ్చిన ‘ఇండియన్‌ 2’ లుక్కే పరిశీలించొచ్చు. అలాగే అంతకుముందు వచ్చిన ‘2.0’, ‘రోబో’, ‘ఐ’.. ఇలా దేనికదే డిఫరెంట్‌గా, ఆసక్తికరంగా ఉంటాయి. కానీ ‘గేమ్‌ ఛేంజర్‌’లో ఆ కిక్‌ లేదు అని చెప్పొచ్చు. చరణ్‌ను రఫ్‌ లుక్‌లో అలా చూపించి హైప్‌ పెంచకూడదు అనుకున్నారా? లేక అనవసరమైన హై ఎందుకు అనుకున్నారా అనేది కూడా ఆలోచించాలి.

‘ఐ’ విషయంలో ఇలా హైప్‌ పెరిగే ఇబ్బంది పడ్డారు. ఏదేమైనా ‘గేమ్‌ ఛేంజర్‌’ లుక్‌ అయితే అంత రుచించలేదు అని చరణ్‌ హార్డ్‌ కోర్‌ ఫ్యాన్స్‌ అంటున్న మాట. అయితే ఇలాంటి వాటిని ఎలా కౌంటర్‌ చేయాలో శంకర్‌కు తెలుసు. కాబట్టి నెక్స్ట్‌ లుక్స్‌, టీజర్‌, ట్రైలర్‌, పాటల విషయంలో కొత్తదనం ఎక్స్పెక్ట్‌ చేయొచ్చు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus