Jr NTR: మే 20 న ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ తప్పదా..!

మే నెల వచ్చింది అంటే ఎన్టీఆర్ అభిమానులకు పండుగ సీజన్ వచ్చినట్టే. ఎందుకంటే మే 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు. 2019 నుండి చూసుకుంటే ఎన్టీఆర్ పుట్టినరోజు అయిన మే 20 కి సరైన సర్ప్రైజ్ రావడం లేదు. గతేడాది ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు కొరటాల శివతో సినిమా అని అనౌన్స్ చేసినా.. అభిమానుల్లో అంతగా ఆసక్తి నెలకొంది లేదు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి వరకు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. అప్పుడే మే 20 వచ్చేస్తుంది.

ఈసారి తప్పకుండా ఎన్టీఆర్ (Jr NTR) పుట్టినరోజు నాడు మంచి సర్ప్రైజ్ ఇవ్వాల్సిందే. లేదంటే ప్రాజెక్ట్ పై బజ్ ఏర్పడే అవకాశం ఉండదు. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లు ఈ ప్రాజెక్టులో భాగమైనట్టు తెలిపారు. కానీ అది సరిపోదు. ఓ చిన్న గ్లిమ్ప్స్ లాంటిదో లేదా బన్నీ పుట్టినరోజు నాడు సుకుమార్ ఇచ్చినట్టు ఓ మేకింగ్ వీడియో లాంటిదో ఏదో ఒకటి విడుదల చేయాలి. అప్పుడు ఉదయమంతా ఆ గ్లింప్స్ చూసుకుని సాయంత్రం సింహాద్రి రీ రిలీజ్ ను ఎంజాయ్ చేస్తారు ఎన్టీఆర్ అభిమానులు.

కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ‘ఎన్టీఆర్ 30 ‘ కి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. 2024 ఉగాది కానుకగా ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మరోపక్క ఎన్టీఆర్ భాగం కాబోతున్న బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘వార్ 2 ‘ సినిమాకి సంబంధించి కూడా ఏదో ఒక సర్ప్రైజ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో మే 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు రచ్చ రచ్చే అనమాట.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus