చిరు డైరెక్టర్ ని నాగ్ పట్టించుకోవడం లేదా..?

దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ‘హనుమాన్ జంక్షన్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యారు మోహన్ రాజా. ఆ తరువాత పూర్తిగా తమిళ ఇండస్ట్రీకే అంకితమయ్యారు. ఎక్కువగా రీమేక్ సినిమాలను తెరకెక్కించి హిట్లు అందుకున్నారు. చాలా కాలానికి తెలుగులో ‘లూసిఫర్’ సినిమాను రీమేక్ చేసి.. రీఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి నటించిన ఈ రీమేక్ కి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ పెట్టారు. టేకింగ్ పరంగా ఈ సినిమాకి మంచి మార్కులు పడ్డాయి.

రిలీజ్ కు ముందు మంచి బజ్ రావడంతో.. భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా హిట్ టాక్ తో దూసుకుపోయింది. ఈ సినిమా తరువాత మోహన్ రాజా.. నాగార్జునతో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు. ఇందులో అఖిల్ కాంబినేషన్ కూడా ఉంటుందని అన్నారు. నాగార్జున వందవ సినిమాగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని అన్నారు. అలాంటిది ఇప్పుడు ఈ సినిమా గురించి అసలు ఊసే లేదు.

నాగార్జున త్వరలోనే రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా తీస్తున్నారు. అంటే.. మోహన్ రాజాతో ప్రాజెక్ట్ వద్దనుకున్నట్లే. మరోపక్క మోహన్ రాజా.. ‘తని ఒరువన్’ సినిమా సీక్వెల్ పనుల్లో బిజీ అయ్యారు. ‘గాడ్ ఫాదర్’ సినిమా వల్ల అవకాశాలు క్యూ కడతాయనుకుంటే.. అది జరక్కపోగా.. తిరిగి కోలీవుడ్ కి వెళ్లిపోయి అక్కడే సినిమాలు చేసుకుంటున్నారు.

ఒకవేళ నాగార్జున ఫ్యూచర్ చేద్దామని మాట ఇచ్చినా.. ఆ విషయం తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే. ‘గాడ్ ఫాదర్’ సినిమా సమయంలో తనకు, తన సినిమాకి ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేసుకున్న దర్శకుడికి ఇప్పుడు తెలుగులో ఒక్క అవకాశం కూడా రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. మరి భవిష్యత్తులో ఏమైనా ఆఫర్స్ వస్తాయేమో చూడాలి!

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus