స్టార్ హీరోలతో కమర్షియల్ ఎలిమెంట్స్ తో సోషల్ ఇష్యూస్ హైలెట్ చేస్తూ సినిమా తీయడం కొరటాల శివ స్టైల్. తన మొదటి చిత్రం మిర్చి నుండి భరత్ అనే నేను చిత్రం వరకు ఆయన చేసిన నాలుగు సినిమాలో ఏదో ఒక సోషల్ ఇష్యూని డిస్కస్ చేశారు. అలాగే కొరటాల సినిమాలలో హీరోయిన్స్ కి అంత ప్రాధాన్యం ఉండదు. సినిమా మొత్తం హీరోపై నడిపించేస్తాడు. మిర్చి లో ఇద్దరు హీరోయిన్స్ వున్నా అటు రిచా కి కానీ ఇటు అనుష్కకు కానీ పూర్తి స్థాయిలో రోల్ ఉండదు. శ్రీమంతుడు సినిమాలో శృతి హాసన్ కొంచెం ప్రాధాన్యం ఉన్న రోల్ చేసింది. ఇక ఎన్టీఆర్ తో ఆయన చేసిన జనతా గ్యారేజ్ సినిమాలో సమంత మరియు నిత్యా మీనన్ పాత్రలు కథకు నామమాత్రమే అని చెప్పాలి. భరత్ అనే నేను సినిమాలో సైతం క్లైమాక్స్ సన్నివేశాలు మినహా కియారా పాత్రకు అంత ప్రాధాన్యం ఉండదు.
ఈనేపథ్యంలో చిరుతో ఆయన చేస్తున్న చిత్రంలో కూడా హీరోయిన్ ప్రాధాన్యం ఏమంత ఉండదు అనిపిస్తుంది. షూటింగ్ మొదలై రెండు నెలలు కావస్తున్నా హీరోయిన్ కి సంబంధించి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఈ అనుమానం ఇంకా బలపడుతుంది. చిరు సినిమాలో త్రిషా చేస్తున్నారని వార్తలు వస్తున్నా అధికారిక ప్రకటన లేదు. ఏది ఏమైనా చిరు సినిమాలో కూడా కొరటాల హీరోయిన్ కి అన్యాయం చేశాడు అనిపిస్తుంది.