ఈ ఉగాది సినిమా కళ కోల్పోనుంది..!

తెలుగు వారి సంవత్సరాది అయిన ఉగాది చాల మందికి సెంటిమెంట్ పండుగ. ఆ రోజు మొదలుపెట్టే పని ఏదైనా మంచి ఫలితాలు ఇస్తుందని నమ్ముతారు. ఇక సెంటిమెంట్ చుట్టూ తిరిగే చిత్ర పరిశ్రమకు ఉగాది ముఖ్యమైన వేడుకలలో ఒకటి. ఉగాది కానుకగా అనేక కొత్త చిత్రాలు ప్రారంభిస్తారు. ఉగాది నాడు అనేక చిన్న, పెద్ద సినిమాల పూజ మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక ఆల్రెడీ మొదలైన సినిమా ఫస్ట్ లుక్స్, టైటిల్ పోస్టర్స్, ట్రైలర్స్, టీజర్స్ వంటి వాటితో పాటు, లిరికల్ సాంగ్స్ కూడా విడుదల అవుతాయి. ఐతే అలాంటి ఉగాది సందడి 2020 కోల్పోనుంది.

రేపు ఉగాది సందర్భంగా టాలీవుడ్ నుండి చెప్పుకోదగ్గ అప్డేట్స్ ఉండవని సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో సామజిక బాధ్యతగా అందరూ ఇళ్లకే పరితం అవ్వాలని నిర్ణయించుకున్నారు. చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలు, సెలెబ్రిటీలు సైతం సాధారణ ప్రజల్లో స్ఫూర్తి నింపడానికి బయటికి రావడం లేదు. ఇక ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ బంధ్ చేయడంతో పాటు కొత్త సినిమాల విడుదల నిలిపివేశారు. దేశంతో పాటు ప్రపంచంలో అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొని ఉన్న తరుణంలో టాలీవుడ్ నుండి రేపు ఎటువంటి సినిమా ప్రకటనలు ఉండవని సమాచారం.

Most Recommended Video


నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus