నోరా ఫతేహి పరిచయం అవసరం లేని పేరు నటిగా ఇండస్ట్రీలో పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం వరుస సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులను కూడా సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈమె వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మట్కా సినిమాలో కూడా సందడి చేయబోతున్నట్టు తెలుస్తుంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే పలాస డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో ఈయన మట్కా అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది ఇక ఈ సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందని సమాచారం. ఈ స్పెషల్ సాంగ్ లో సందడి చేయడానికి మేకర్స్ నటి నోరా ఫతేహి నీ సంప్రదించినట్టు తెలుస్తుంది. ఇక ఈమె కూడా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
అయితే ఈ స్పెషల్ సాంగ్ చేయడం కోసం నోరా ఫతేహి (Nora Fatehi) భారీ స్థాయిలోనే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఈమె ఏకంగా 30 లక్షల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నారట. కేవలం ఐదు నిమిషాల స్పెషల్ సాంగ్ కోసం 30 లక్షల రెమ్యూనరేషన్ అంటే ఇది మామూలు విషయం కాదని చెప్పాలి.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలి అంటే ఈ విషయంపై మేకర్స్ స్పందించాల్సి ఉంది.ఇక ఈ నెలలో వరుణ్ తేజ్ నటించిన గాండీవదారి అర్జున సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.
జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!