రాజమౌళి పై సాకులు చెబుతూ ‘ఆర్.ఆర్.ఆర్’ హీరోల ఫన్నీ వీడియో..!

దర్శకధీరుడు రాజమౌళి పుట్టినరోజు ఈరోజు. దాంతో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్ర యూనిట్ సభ్యులు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఒక ఫన్నీ వీడియోని విడుదల చేశారు. సాధారణంగా రాజమౌళి పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ సినిమా మొదలుపెట్టినా.. అది పూర్తవ్వడానికి ఎలాగూ 2 లేదా 3 ఏళ్ళు అవుతుంది. అయితే అన్ని సంవత్సరాలు రాజమౌళితో ట్రావెల్ చేసే హీరోలు మరియు యూనిట్ సభ్యుల ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియో సారాంశం.రాజమౌళి పై కంప్లైంట్ చేస్తూ ఈ వీడియో చేశారు. మరి ‘ఆర్.ఆర్.ఆర్’ హీరోల కంప్లైంట్స్ ఎలా ఉన్నాయో.. ఓ లుక్కేద్దాం రండి :

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “కాంప్లికేటెడ్ షాట్స్ ఎప్పుడూ రిలాక్స్ అయిపోదాం అనుకునే టైములోనే పెడుతుంటాడు ఈయన.మధ్యాహ్నం 12 : 30 నిమిషాలకు ఒక షార్ట్ ఉంటుంది. అది ఆయన పెడతాడో.. లేక మా దారిద్య్రానికి వచ్చి పడుతుందో కానీ.. ఆ షార్ట్ ఓకే అవ్వదు. మధ్యాహ్నం 1 గంట అవ్వుద్ది షార్ట్ ఓకే అవ్వదు… 2:30 అయినా అవ్వదు.అప్పటికి మా ఆకలి మొత్తం చచ్చిపోద్ది.అందుకే జక్కన్న అనేది ఈయన్ని. 30 రోజులు షెడ్యూల్ జరిగినప్పుడు నైట్ 2 గంటలకు ప్యాకప్ అని చెబుతాడు. కానీ నైట్ 1: 30 నిమిషాలకు ఓ షాట్ మొదలుపెట్టాడు. అది పూర్తయ్యి ప్యాకప్ చెప్పేసరికి తెల్లవారు జామున 4:30 అయ్యింది. ఇక మా రాక్షసుడి గురించి ఏం చెప్పాలి. ఆయన పర్ఫెక్షన్ తో మమ్మల్ని చావగొట్టేస్తాడు” అంటూ కంప్లైంట్ చేసాడు.

రాంచరణ్ మాట్లాడుతూ.. “రాజమౌళి గారు ఫస్ట్ టైం యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నాడు ‘ఆర్.ఆర్.ఆర్’ లో.. అని ఎక్సయిటెడ్ గా జిమ్ గిమ్ అన్నీ చేసేసి ‘గుడ్ మార్నింగ్ సార్.. హౌ ఆర్ యు’ అని వెళ్లి పలకరిస్తే .. రా చరణ్ కూర్చో అని చెప్పాడు. తరువాత ఆ 40 అడుగుల హైట్ నుండీ జంప్ చేసే షాట్ ఒకటి ఉంది అని చెబుతాడు. ‘బాగుంది సర్.. కానీ రిస్క్ ఉంది కదా ఎవరు చేస్తారు? అని అడిగితే.. ‘ఎవరు ఏంటి చరణ్.. నువ్వే చెయ్యాలి’ అంటూ చెబుతాడు.నా వల్ల కాదు అని చెప్పినా వినడు. ఆయనకి నో అనలేక ఇంకేం చేస్తాం ఓకే అని వెళ్ళిపోతాం” అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే ఏ కారణాలు చెప్పి కంప్లైంట్ చేసారో.. అవే కారణాలకు థాంక్స్ చెబుతూ .. ‘హ్యాపీ బర్త్ డే టు రాజమౌళి’ అంటూ చెప్పుకొచ్చారు చిత్ర యూనిట్ సభ్యులు.


చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus