అందరూ ఆహో, ఓహో అంటూ తెగ పొగిడేసిన ఎన్టీఆర్ కథానాయకుడు పెట్టిన మొత్తంలో కనీసం సగం కాదుకదా పావు వంతు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 60 కోట్లకు అమ్ముడైన ఈ చిత్రం కనీసం 20 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. ఇక ఓవర్సీస్ లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అక్కడ 9 కోట్లకు కొనగా.. 3.8 కోట్లు వసూలు చేసింది. దాంతో 70% లాస్ తో ఢీలాపడ్డాడు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్. ఇటీవల బాలయ్య సెకండ్ పార్ట్ అయిన “ఎన్టీఆర్ మహానాయకుడు”ను లాసైన డిస్ట్రిబ్యూటర్స్ కు ఫ్రీగా ఇస్తానని ప్రకటించినప్పటికీ.. ఆ సెకండ్ పార్ట్ తో అయినా లాసేస్ కవరవుతాయా అని కంగారు పడుతున్నారు సదరు డిస్ట్రిబ్యూటర్స్.
ఇదంతా పక్కన పెడితే.. సెకండ్ పార్ట్ తో ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు క్రిష్. ఇక బాలయ్య అయితే భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఇలా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవడంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఊగిసలాడుతున్నాడట. ప్రస్తుతం రీషూట్స్ జరుగుతుండగా.. ఫిబ్రవరి 14న సెకండ్ పార్ట్ ను రిలీజ్ చేయనున్నారు