ఎన్టీఆర్ మారిపోయాడు!!
- February 9, 2016 / 01:10 PM ISTByFilmy Focus
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మాస్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే సక్సెస్‌ఫుల్ హీరోగా ఎన్టీఆర్ చిన్న వయసులోనే భారీ హిట్స్ కొట్టాడు. ఇక అనుకోకుండా డిజాస్టర్స్ పలకరించడంతో ఒకానొక సమయంలో ఎన్టీఆర్ ఈజ్ ఔట్ అన్న న్యూస్ కూడా వినిపించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ ‘టెంపర్’, నాన్నకు ప్రేమతో చిత్రాలతో మంచి హిట్స్ కొట్టి చాలా హ్యపీగా ఉన్నాడు. అంతేకాకుండా కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ అనే టైటిల్ తో సినిమా కూడా చేస్తున్నాడు. ఇప్పటివరకూ తాను ఎంచుకున్న సినిమాల్లో కొన్ని సినిమాల వల్ల తన ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని, హిట్ ఇచ్చిన దర్శకుల వెనుక ఎన్టీఆర్ పడతాడని తనపై ఉన్న అపఖ్యాతిని ఎన్టీఆర్ చెరిపేసుకోవాలని అనుకుంటున్నాడు అని టాలీవుడ్ లో వినిపిస్తున్న వాదన, దానికి ఉదాహరణ ఈ కధే, విషయం ఏమిటంటే గబ్బర్ సింగ్ ‘హరీష్ శంకర్’ గుర్తున్నాడా….’రామయ్యా వస్తావయ్యా’ అంటూ ఎన్టీఆర్ కు భారీ డిజాస్టర్ ను ఇచ్చిన దర్శకుడు. ఏదో గబ్బర్ సింగ్ మంచి హిట్ ఇచ్చాడు కదా అని, పిలిచి మరీ అవకాశం ఇస్తే భారీ ఫ్లాప్ ను మూటగట్టాడు. ఆ సినిమా ఫర్స్ట్ హాఫ్ బాగానే తీసినా, సెకెండ్ హాఫ్ ను నాశనం చేసి ఎన్నో అంచనాలతో ఉన్న అభిమానులను నిరాశ పరిచాడు. ఇక ఈ మధ్య ఈ దర్శకుడు ఎన్టీఆర్ ను కలసి ఒక పవర్ ప్యాక్డ్ కధ చెప్పగానే, ఎన్టీఆర్ సున్నితంగా ‘నో’ చెప్పడంటా. దానికి కారణం తాను ఇప్పుడే మళ్లీ సక్సెస్ బాట పట్టానని, రిస్క్ చెయ్యలేను అని చెప్పాడని సమాచారం, ఇక ఎన్టీఆర్ అలా చెప్పడంతో, దిగాలు పడ్డ మన దర్శకుడు అక్కడ నుంచి మౌనంగా వెళ్ళిపోయాడని సమాచారం. ఏది ఏమైనా….కొన్ని పరాజయాలు ఎన్టీఆర్ ను మార్చేశాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













