ఎన్టీఆర్ కలల ప్రాజక్ట్ థియేటర్ లోకి వచ్చేది అప్పుడే
- May 6, 2017 / 06:52 AM ISTByFilmy Focus
మాటల మాంత్రికుడు త్రివిక్రమ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించాలన్నది యంగ్ టైగర్ ఎన్టీఆర్ కల. నందమూరి అభిమానులు సైతం వీరి కాంబినేషన్లో సినిమా రావాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. కానీ తారక్, త్రివిక్రమ్ తమతమ ప్రాజక్ట్స్ లో బిజీగా ఉండడం వల్ల అది కుదరలేదు. జనతాగ్యారేజ్ విజయం గ్యాప్ తీసుకొని మరీ త్రివిక్రమ్ తో మూవీ సెట్ జేశారు ఎన్టీఆర్. ప్రస్తుతం డైరక్టర్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మూవీ పట్టాలెక్కనుంది. ఇప్పుడు ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమా చేస్తున్నారు. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెప్టెంబర్ 1 న రిలీజ్ కానుంది.
ఆ లోపున త్రివిక్రమ్, పవన్ మూవీని కంప్లీట్ చేయనున్నారు. అప్పటికీ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఫ్రీ కావడంతో.. వెంటనే ఆలస్యం చేయకుండా అక్టోబర్ నుంచి తమ కాంబినేషన్లో సినిమాను మొదలెట్టాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. మూవీ ప్రారంభం మాత్రమే కాదు. ఆ చిత్రాన్ని ఆరు నెలల్లో పూర్తి చేసి వచ్చే ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం. సో వచ్చే వేసవిలో ఎన్టీఆర్ మరో బ్లాక్ బస్టర్ హిట్ అందు కోనున్నారన్నమాట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















