మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పటినుంచో అనుకుంటున్నారు. అప్పట్లో త్రివిక్రమ్ చెప్పిన ఫ్యామిలీ కథలు తారక్ కి నచ్చకపోవడంతో వీరి కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కలేదు. ఈ సారి ఎలాగైనా ఈ డైరక్టర్ తో సినిమా చేయాలనీ ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారు. అదే విషయాన్నీ త్రివిక్రమ్ ముందు ఉంచారు.
ఇప్పుడు తాను రెండు కథలు మాత్రమే డెవలప్ చేశానని, అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “దేవుడే దిగివచ్చినా..” అనే పేరుతో వచ్చే నెల నుంచి సినిమా ప్రారంభిస్తున్నానని… మరో కథను సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ మూవీ కోసం ఎత్తిపెట్టినట్టు డైరక్టర్ నిజాయితీగా చెప్పారంట. అయితే ఈ రెండింటిలో ప్రిన్స్ కోసం రాసుకున్న కథ ఎన్టీఆర్ కి భలే నచ్చిందంట.. ఆ స్టోరీతో తనతో సినిమా చెయ్యమని అడిగారని సమాచారం.
కాస్త ఆలస్యమైనా మంచి కథ రాస్తానని త్రివిక్రమ్ బుజ్జగించినా తారక్ ఒప్పుకోవడం లేదని ఫిల్మ్ నగర్ వర్గాల వారు చెబుతున్నారు. చిన్నపిల్లవాడిలా మహేష్ స్టోరీనే కావాలని ఎన్టీఆర్ పట్టుపట్టినట్లు వెల్లడించారు. మరి త్రివిక్రమ్ స్టోరీని ఎన్టీఆర్ కి ఇస్తారా? ఇవ్వరా? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.