తరవాతి సినిమాపై ఎన్టీఆర్ నిర్ణయం ఏమిటి ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా కాలం తర్వాత హిట్ ట్రాక్  లోకి వచ్చారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్నారు. తర్వాత ఏంటి? ఏ కథను ఎంచుకుంటారు ? అన్నదే ఇప్పుడు పరిశ్రమలోని ప్రముఖుల ప్రశ్న. యాక్షన్, లవ్, ఫ్యామిలీ డ్రామా.. ఎటువంటి జాన్రాలో కథ చెబితే ఒకే చేస్తాడో తెలియక దర్శకులు తల పట్టుకుంటున్నారు. ఇది వరకు తన సినిమాలకు రచయితగా పనిచేసిన వక్కంతు వంశీ చెప్పిన కథను కూడా తారక్ పక్కన పెట్టారు. రీసెంట్ గా యువ దర్శకుడు అనిల్ రావిపూడి యంగ్ టైగర్ కు కథ చెప్పారు. పటాస్, సుప్రీమ్ సినిమాలు తీసిన ఈ డైరెక్టర్ చెప్పిన దాంట్లోనూ కొత్తదనం లేదని సమాచారం.

ఇక పూరి జగన్నాథ్‌ చెప్పిన లైన్ బాగుంది కానీ.. అది స్క్రిప్ట్ గా మారేసరికి ఎలా ఉంటుందో, ఎప్పటికి పూర్తి అవుతోందోనని, ఆ కథను కూడా లైట్ తీసుకున్నట్లు ఎన్టీఆర్ సన్నిహితుల ద్వారా తెలిసింది. తమిళ దర్శకుడు లింగుస్వామి కూడా తన కథతో తారక్ ని మెప్పించేందుకు కొద్దీ రోజులుగా ప్రయత్నిస్తున్నారు. అయినా తుఫాన్ ముందు నిశ్శబ్దంలా ఆయన ఏమి చెప్పకుండా మౌనంగా ఉన్నారు. సింహాద్రి తర్వాత ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అపజయాలు ఎదురు అయ్యానని, ఈ సారి అలాంటి తప్పులు జరగ కూడదని ఎన్టీఆర్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఎంతమంది డైరక్టర్లు కథలతో కన్ఫ్యూజ్ చేస్తున్నా అతను మాత్రం తడబడకుండా ఫ్రెష్ కథ కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఆ అదృష్టం ఎవరికి వరిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus