భారీ అంచనాలు, ఆశల నడుమ విడుదలైన “ఎన్టీఆర్ కథానాయకుడు” చిత్రానికి సూపర్ హిట్ టాక్ & పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ మాత్రం ఆశాజనకంగా లేవు. ఒక రకంగా చెప్పాలంటే సినిమాను భారీ ధరలకు కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కు తీవ్రమైన నష్టం తెచ్చిపెట్టిన సినిమా “ఎన్టీఆర్ కథానాయకుడు”. తన తండ్రి పాత్రను బాలయ్య పోషించి మరీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. దాదాపు 60 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన ఈ చిత్రం ఇప్పటివరకూ కనీసం 20 కోట్లు కూడా రాబట్టలేకపోయింది.
సో, సినిమాకి కనీసం 50% రెమ్యూనరేషన్ అయినా రికవరీ అవ్వాలంటే కనీసం ఇంకో మూడు వారాలపాటు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడిస్తే తప్ప పాజిబుల్ అయ్యే అవకాశం లేదు. అందుకే రెండో భాగమైన “ఎన్టీఆర్ మహానాయకుడు” చిత్రాన్ని కూడా ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 14కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మరి ఈ జాగ్రత్తలు కలెక్షన్స్ పరంగా ఏమైనా హెల్ప్ అవుతాయో లేదో చూడాలి.