ఎన్టీఆర్ మహానాయకుడు విడుదల తేదీ విషయంలో ప్రస్తుతం హై టెన్షన్ చోటు చేసుకొని ఉంది. ఫిబ్రవరి 8న విడుదలవ్వాల్సిన ఈ చిత్రం కారణాంతరాల వలన ఆరోజు విడుదలవ్వడం లేదన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ కొత్త డేట్ ఏమిటనేది అఫీషియల్ గా ఎవరూ కన్ఫర్మ్ చేయలేదు. దాంతో సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని నందమూరి ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రాలో మరో నాలుగు నెలల్లో ఎలక్షన్స్ జరగనుండడం.. ముఖ్యంగా ఈ నెలలోనే లేదా మార్చి మొదటివారంలో ఎలక్షన్ నోటిఫికేషన్ రానుండడంతో.. పోలిటికల్ ఫిలిమ్ అయిన “ఎన్టీఆర్ మహానాయకుడు” విడుదలవ్వడం కష్టం.
దాంతో సినిమా విడుదలైతే మార్చి లోపు అవ్వాలి.. లేదంటే ఎలక్షన్స్ తర్వాత విడుదలవ్వాలి అని టాక్ నడుస్తుండగా.. మార్చి 1న మహాశివరాత్రికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉన్నప్పటికీ.. నందమూరి ఫ్యాన్స్ అందరూ మాత్రం ఆ సినిమా అప్పుడు రిలీజ్ అవ్వడమే మంచిది అనుకొంటున్నారు. ఒకవేళ అదే గనుక జరిగితే.. అదే రోజున విడుదలవుతున్న కళ్యాణ్ రామ్ “118” చిత్రానికి బాలయ్య పోటీగా నిలిచినట్లవుతుంది. మరి బాబాయ్ కోసం అబ్బాయ్ వెనక్కి వెళ్తాడో లేదా అనేది తెలియాలి.శ్లేషకుల సమాచారం. సాధారణంగా శంకర్ క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడడనేది తెలిసిన సంగతే. మరి ముందు.. ముందు ఈ చిత్రం కోసం ఇంకెన్ని కసరత్తులు చేస్తాడో చూడాలి..!