NTR, Mahesh Babu: బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ టెలీకాస్ట్ డేట్ ఇదే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో బుల్లితెరపై అదిరిపోయే స్థాయిలో రేటింగ్స్ ను సొంతం చేసుకోలేకపోయినా మంచి షోగా పేరు తెచ్చుకుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ షోకు గెస్టులుగా హాజరై సందడి చేశారు. మహేష్ ఈ షోకు హాజరైన ఎపిసోడ్ షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తైనా ఆలస్యంగా ఈ ఎపిసోడ్ ను ప్రసారం చేయాలని జెమిని నిర్వాహకులు భావించారు. మహేష్, తారక్ ఎపిసోడ్ డిసెంబర్ నెల 5వ తేదీన ప్రసారం కానుంది.

సాధారణంగా ఎవరు మీలో కోటీశ్వరులు షో సోమవారం నుంచి గురువారం వరకు ప్రసారమవుతుంది. ఈ ఎపిసోడ్ మాత్రం ఆదివారం టెలీకాస్ట్ కానుంది. తాజాగా రిలీజైన ప్రోమో వల్ల ఈ ఎపిసోడ్ పై అంచనాలు మరింత పెరిగాయి. అటు తారక్ ఫ్యాన్స్, ఇటు మహేష్ ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిసోడ్ టీఆర్పీ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఈ షో నిర్వాహకులు భావిస్తున్నారు. రామ్ చరణ్ హాజరైన ఎపిసోడ్ కు మంచి రేటింగ్ రాగా మహేష్ గెస్ట్ గా హాజరయ్యే ఎపిసోడ్ కు కూడా మంచి రేటింగ్స్ వచ్చాయి.

మహేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నా తారక్ తో ఉన్న అనుబంధం దృష్ట్యా ఈ ఎపిసోడ్ కు గెస్ట్ గా హాజరయ్యారు. వచ్చే ఆదివారం రాత్రి 8.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus