టాలీవుడ్ కి చెందిన ముగ్గురు టాప్ హీరోలు 2020లో స్క్రీన్ పై కనిపించరు. వారిలో ఆర్ ఆర్ ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాగా మరో హీరో మహేష్ వచ్చి చేరారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ జనవరి 8, 2021లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే రాజమౌళి ప్రకటించడం జరిగింది. నిజానికి ఈ చిత్రం 2020 జులై 30న విడుదల చేయాలని భావించారు. ఎన్టీఆర్, చరణ్ గాయాలపాలు కావడం, రాజమౌళి కుమారుడు వివాహం, లండన్ లో బాహుబలి మూవీ స్పెషల్ స్క్రీనింగ్ వంటి విషయాలతో పాటు హీరోయిన్ అలియా భట్ గైర్హాజరు ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా పడేలా చేశాయి.
కాగా టాలీవుడ్ నుండి మరో టాప్ హీరో 2020 ని మిస్సయ్యేలా కనిపిస్తున్నాడు. మహేష్ బాబు కూడా 2020లో మూవీ విడుదల చేసే దాఖలాలు కనిపించడం లేదు. ఆయన మొదట అనుకున్నట్లు మే లో వంశీ పైడిపల్లితో మూవీ మొదలుపెడితే డిసెంబర్ లోపు మూవీ విడుదల అయ్యేది. వంశీ పైడిపల్లి మూవీ హోల్డ్ లో ఉన్న కారణంగా మహేష్ ఇంకా కథలు వినేపనిలో ఉన్నారు. ఆయన దర్శకుడిని ఎంపిక చేసి, ఆ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టే నాటికి కనీసం మరో నాలుగైదు నెలల సమయం పట్టేలా కనిపిస్తుంది. కాబట్టి ఎన్టీఆర్, చరణ్ ల మాదిరి మహేష్ సైతం 2020కి వెండి తెరకు దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది.
Most Recommended Video
యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!