రాజమౌళి, ఎన్టీఆర్ ల ఫోటో వెనుక ఉన్న కథ తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే దర్శకధీరుడు రాజమౌళి ల మధ్య సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రంతోనే కెరీర్ ను మొదలుపెట్టారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్ లేట్ అవ్వడంతో ‘నిన్ను చూడాలని’ చిత్రంతో ఎన్టీఆర్ కాస్త ముందుగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఎన్టీఆర్ కు మొదటి హిట్ అందించింది మాత్రం రాజమౌళినే..! ఆ తరువాత వీరిద్దరూ కలిసి ‘సింహాద్రి’ అనే చిత్రం కూడా చేశారు.

అది కూడా సూపర్ హిట్ అయ్యింది. ఒకానొక టైములో ఎన్టీఆర్ వరుస పరాజయాలతో సతమతమవుతున్న తరుణంలో ‘యమదొంగ’ చిత్రంతో హిట్ ఇచ్చి ఎన్టీఆర్ ను ఆదుకున్నాడు రాజమౌళి. మళ్ళీ 13ఏళ్ళ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం రాబోతుంది. ఇక రాజమౌళిని… ఎన్టీఆర్ జక్కన్న అని పిలుస్తుంటాడు. రాజమౌళి.. ఎన్టీఆర్ ను తారక్ అని పిలుస్తుంటాడు. ‘ఎన్టీఆర్ లో నెంబర్ వన్ హీరో కనిపిస్తుంటాడు’ అని రాజమౌళి ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్ ప్రతీ సినిమా వేడుకకి రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరవుతూ ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఇక ఈరోజు రాజమౌళి పుట్టినరోజు కావడంతో ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ స్పాట్ లో జక్కన్నతో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు ఎన్టీఆర్. ఈ ఫొటోలో ఇద్దరూ నవ్వుతూ కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ పిక్ వైరల్ గా మారింది.


Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus