దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ కాంబోలో మళ్లీ మూవీ రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. వారి కోరిక ఫలించింది. ఇద్దరూ మళ్లీ కలిశారు. అయితే చిన్న చేంజ్. ఈ సారి వీరిద్దరూ చేతులు కలిపింది సినిమా కోసం కాదు. ఒక మంచి పని కోసం.. అది ఏమిటంటే.. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. వాటికీ అడ్డుకట్ట వేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఐదు షార్ట్ ఫిల్మ్‌లను రూపొందించారు. ఫేస్‌బుక్, వాట్సప్ తదితరాలతో నేరగాళ్లు ఎలా ట్రాప్ చేస్తారు? ఫేస్‌బుక్‌లో వ్యక్తిగత ఫొటోలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారు?.
అమ్మాయిలు, అబ్బాయిల నకిలీ ఫొటోలతో ఖాతాలు తెరిచి ఎలా మోసాలకు పాల్పడుతున్నారన్న అంశాలు లఘుచిత్రాల్లో ఉన్నాయి. ఈ లఘు చిత్రాలకు ఎన్టీఆర్, రాజమౌళిలు స్వచ్ఛందంగా వాయిస్ ఓవర్ అందించారు. సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, టీవీలు, బహిరంగ ప్రదేశాల్లో ఈ షార్ట్ ఫిలిమ్స్ ప్రసారం చేయనున్నామని హైదరాబాద్ అదనపు సీపీ(నేరపరిశోధన) స్వాతి లక్రా వివరించారు. ఎన్టీఆర్, రాజమౌళి లకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. వారి వాయిస్ తో వస్తున్న షార్ట్ ఫిల్మ్స్ చైతన్యాన్ని కలిగిస్తుందడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.