కొద్దిసేపటి క్రితం ‘ఆర్.ఆర్.ఆర్’ టీం ప్రేక్షకులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. ‘2 పాటలు మినహా.. ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ పూర్తయ్యిందని.. హీరోలైన చరణ్, ఎన్టీఆర్ లు రెండు భాషల్లో డబ్బింగ్ కూడా ఫినిష్ చేసారని.. మరికొద్ది రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తవుతాయని’ ట్విట్టర్ ద్వారా ‘ఆర్.ఆర్.ఆర్’ టీం తెలిపింది. అంతేకాదు చరణ్, ఎన్టీఆర్ లు.. బైక్ పై వెళ్తున్న ఫోటోని కూడా షేర్ చేశారు. ఈ పిక్.. చరణ్, ఎన్టీఆర్ ల అభిమానుల్లో కొత్త జోష్ ను నింపేలా ఉందని చెప్పొచ్చు.
అయితే విడుదల తేదీ ఎప్పుడనే విషయం పై మాత్రం చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు. నిజానికి ఇది కొత్త న్యూస్ ఏమీ కాదు.. రెండు పాటల షూటింగ్ బ్యాలన్స్ ఉందని గత 7 వారాల నుండీ ప్రచారం జరుగుతుంది. అదే విషయాన్ని ‘ఆర్.ఆర్.ఆర్’ టీం ఇప్పుడు కన్ఫర్మ్ చేసింది అంతే. ఇటీవల ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. థర్డ్ వేవ్ ఎఫెక్ట్ రాక ముందే షూటింగ్ ను కంప్లీట్ చేయాలని దర్శకుడు రాజమౌళి డిసైడ్ అయ్యాడు.
ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నట్టు.. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ రాకముందు అనౌన్స్ చేశారు. అయితే ఆ డేట్ కు సినిమా రావడం అంత ఈజీ వ్యవహారం అయితే కాదు. ఇది పాన్ వరల్డ్ సినిమా కాబట్టి.. అన్ని భాషల్లోనూ సినీ పరిశ్రమ కోలుకోవాలి.అక్టోబర్ నాటికి అంతా సెట్ అవుతుంది అనే గ్యారెంటీ అయితే చిత్ర పరిశ్రమలో కనిపించడం లేదు.