నేడు వార్తల్లో వచ్చిన సర్వీస్ టాక్స్ మినహాయింపు కథనం పై , ఒక బాధ్యత గల భారత పౌరుడి గా నా స్పందన తెలియచేయటం సబబు అని భావించి, జరిగిన సంఘటనలను వివరించ దలిచాను. 2015 లో “నాన్నకు ప్రేమతో” అనే సినిమా లో నటించిన సంగతి తెలిసినదే. ఇది లండన్ లో నిర్మించిన చిత్రం. పొరుగు దేశం లో అందించిన సర్వీస్ (హీరో గా) కు భారత దేశం లో సర్వీస్ టాక్స్ వర్తించదు అని నాకు చెప్పడంతో, చట్టం ప్రకారమే నేను “నాన్నకు ప్రేమతో” సినిమా నిర్మాతల వద్ద సర్వీస్ టాక్స్ వసూలు చేయలేదు.
2016 లో, ఇదే విషయం పై CAG నుండి వచ్చిన క్వెరీ కి లిఖిత పూర్వం గా మా ఆడిటర్ లు స్పందించటం జరిగింది. ఆ స్పందన తరువాత, ఎటువంటి అధికారిక ఉత్తర్వులు కానీ, నోటీసు లు కానీ మాకు అందలేదు. చాలా సంవత్సరాలు గా ఆదాయపు పన్ను మరియు సర్వీస్ టాక్స్ క్రమం తప్పకుండా చెల్లిస్తున్న వ్యక్తిని నేను. భారత పౌరుడి గా నా చట్టపరమైన బాధ్యతలను ఎన్నడూ మరువలేదు. ఈ విషయం లో సంబంధిత అధికారుల నుండి నాకు ఆదేశాలు అందితే, నా వైపు నుండి నేను చట్టపరం గా చెల్లించాల్సిన రుసుము ఏమైనా ఉంటే, అణా పైసల తో సహా చెల్లించేందుకు నేను సిద్ధము గా ఉన్నాను. ఈ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చట్టానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలి అని నమ్మే నేను, ఈ విషయం లో కూడా అదే పాటిస్తున్నాను.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.