రైటర్ గా ఎన్నో సినిమాలకు పని చేసిన కొరటాల శివ ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటాడు. అప్పటినుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను రూపొందిస్తూ హిట్టు మీద హిట్టు కొడుతున్నాడు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు, రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
ఇదిలా ఉండగా.. ఈరోజు కొరటాల శివ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ఆయన బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్.. కొరటాలను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. ‘స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అంటూ రాసుకొచ్చాడు ఎన్టీఆర్. ఈ ట్వీట్ బట్టి ఎన్టీఆర్-కొరటాల శివల మధ్య మంచి స్నేహబంధం ఉందని తెలుస్తోంది.
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పూర్తయిన వెంటనే కొరటాల సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. ఇప్పటినుండే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. మరోసారి ఎన్టీఆర్ తో కొరటాల బ్లాక్ బస్టర్ హిట్ తీస్తారేమో చూడాలి!
స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. Wishing my dear friend and well wisher, @sivakoratala garu a very Happy Birthday