సంబరాలకు దూరంగా ఎన్టీఆర్.. కారణం అదే?
- May 17, 2019 / 03:21 PM ISTByFilmy Focus
ఎన్టీఆర్ ప్రస్తుతం చరణ్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ హీరోలిద్దరికీ గాయాలు కావడంతో షూటింగ్ వాయిదా పడింది. ఇదిలా ఉండగా మే 20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఇది ఎన్టీఆర్ కు 36 వ పుట్టినరోజు. ఎన్టీఆర్ కు మాస్ ఫ్యాన్స్ ఉండడంతో ప్రతి ఏటా ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. ఎన్టీఆర్ కూడా కుటుంబ సభ్యులతో కలసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉంటాడు.
- ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మహర్షి డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
అయితే ఈసారి మాత్రం.. తారక్ పుట్టినరోజు వేడుకలకి దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం. ఇందుకు ముఖ్యకారణం తన తండ్రి హరికృష్ణ మరణం. గత ఏడాది ఆగష్టు 29న నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయన మృతి చెంది ఇంకా సంవత్సరం కూడా పూర్తవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎలాంటి సంబరాలు జరుపుకోకూడదని ఎన్టీఆర్ భావిస్తున్నాడని అయన సన్నిహితులు చెప్పుకొస్తున్నారు.దీని పై కొందరు అభిమానులు నిరాశకు గురైనప్పటికీ… మరికొందరు అభిమానులు ఎన్టీఆర్ పుట్టినరోజున సేవ కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.














