3 ఏళ్ళుగా ఎన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రాజెక్ట్ తోనే బిజీగా గడుపుతూ వస్తున్నాడు.ఈ ప్రాజెక్టు ప్రారంభం అయినప్పటి నుండి ఏవో ఒక అవంతరాలు వస్తున్నాయి. మొదట హీరోయిన్ హ్యండివ్వడం, తర్వాత హీరోలకు గాయాలు అవ్వడం, ఇక కరోనా ఎంటర్ అయినప్పటి నుండీ పరిస్థితి చెప్పనవసరం లేదు.ఇప్పటికే 3 సార్లు రిలీజ్ డేట్ మారింది.ఇదిలా ఉండగా.. ఆర్.ఆర్.ఆర్ కంప్లీట్ అవ్వకపోవడం వలన ఎన్టీఆర్ ఆర్.ఆర్ ఆర్ తర్వాత కమిట్ అయిన ప్రాజెక్టులకు దూరం కావాల్సి వస్తుంది.
ఇప్పటికే త్రివిక్రమ్ మూవీ మిస్ అయ్యింది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ ప్రాజెక్ట్ అయ్యే వరకు లైన్ లోకి రాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్… రాజమౌళి ని తెగ కంగారు పెడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఏంటంటే… ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ అనే కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయాల్సి ఉంది. ఆల్రెడీ దీనికి సంబందించిన లాంచ్ ఈవెంట్ కూడా జరిగింది. అలాగే ప్రోమోను కూడా వదిలారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ షో వాయిదా పడింది.
సన్ నెట్ వర్క్ వాళ్ళు అంత ఈజీగా కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు కాదు. వాళ్ళు ఒకరితో ప్రాజెక్ట్ ఫిక్స్ చేయించుకుంటే.. కచ్చితంగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాల్సిందే. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ పై వాళ్ళు ఒత్తిడి పెడుతున్నట్టు సమాచారం. అందుకే ఎన్టీఆర్ కూడా ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ లో తన పోర్షన్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయమని రాజమౌళి ని తొందర పడుతున్నాడట.