NTR30: ఎన్టీఆర్30 సినిమా షాకింగ్ అప్ డేట్స్ వచ్చేది ఆ రోజేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్30 సినిమా సినిమా షూట్ శరవేగంగా జరుగుతుండగా తారక్ ఊరమాస్ రోల్ లో కనిపిస్తుండటంతో ఈ సినిమా కోసం, ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో తారక్ ను కొరటాల శివ సరికొత్తగా చూపించనున్నారని తెలుస్తోంది. అయితే మరో మూడు వారాల్లో తారక్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఫ్యాన్స్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.

ఎయితే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజున (NTR30) ఎన్టీఆర్30 సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ కానున్నాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ జోరుగా ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో ఈ మూవీ అదే టైటిల్ ను ఫిక్స్ చేస్తారో లేక మరో టైటిల్ ను ఫిక్స్ చేస్తారో చూడాల్సి ఉంది. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో నటిస్తుండటంతో బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరుగుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. కొరటాల శివ ఈ సినిమా మరో ఆచార్య కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. కొరటాల శివ ఈ సినిమా కోసం 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని తెలుస్తోంది. కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.

దర్శకుడిగా కొరటాల శివ స్థాయిని మరింత పెంచే విధంగా ఈ సినిమా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొరటాల శివ తారక్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తారక్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు. తారక్ పుట్టినరోజు కానుకగా సింహాద్రి సినిమా రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus