యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్ ఈ మధ్య కాలంలో చాలా మారింది. మొన్నామధ్య చాలా సన్నగా కనిపించాడు.అది కచ్చితంగా ‘వార్ 2’ సినిమా కోసమని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమాలో ఎన్టీఆర్ లుక్స్ కి చాలా వరకు వి.ఎఫ్.ఎక్స్ వాడారు. అయితే ఎన్టీఆర్ డూప్ మాత్రం అతనికి ఒంట్లో బాలేదు. అందుకే వీక్ అయిపోయాడు అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
అందుకు తగ్గట్టే ‘వార్ 2’ లో ఎన్టీఆర్ లుక్స్ కూడా ఉన్నాయి. కొన్ని సన్నివేశాల్లో స్లిమ్ గా కనిపించిన ఎన్టీఆర్.. మరికొన్ని సన్నివేశాల్లో బొద్దుగా కనిపించి షాకిచ్చాడు. ఈ క్రమంలో తన నెక్స్ట్ సినిమా కోసం ఎన్టీఆర్ డైట్ పాటిస్తున్నట్టు, కాస్ట్ లీ వాటర్ తీసుకుంటున్నట్టు అతని టీం చెప్పుకొచ్చింది. సో ఎన్టీఆర్ కొత్త లుక్ ‘వార్ 2’ కోసం కాదు అనే క్లారిటీ అందరికీ వచ్చింది.
‘వార్ 2’ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్). ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నుండి రానున్న పాన్ ఇండియా మూవీ ఇది.కొంత భాగం చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఎంపికైంది. నెక్స్ట్ షెడ్యూల్ కు కొంత గ్యాప్ ఉండటంతో ఎన్టీఆర్.. తన లుక్ పై దృష్టి పెట్టాడు. ఇందులో భాగంగా.. స్పెషల్ ట్రైనర్ ను పెట్టుకుని జిమ్లో తెగ కసరత్తులు చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్ ను చూసి.. అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
#JrNtr On Beast Mode pic.twitter.com/JnEbpRVDu8
— Filmy Focus (@FilmyFocus) September 16, 2025