2000 వ సంవత్సరం అక్టోబర్ 13న విడుదలైన ‘నువ్వే కావాలి’ చిత్రం ఇండస్ట్రీ హిట్ అయ్యిందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈరోజుతో ఆ చిత్రం విడుదలై 21 ఏళ్ళు పూర్తికావస్తోంది. ‘ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్’ పై రామోజీరావు గారు నిర్మించిన ఈ చిత్రానికి కె.విజయ భాస్కర్ దర్శకత్వం వహించాడు.త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన సంభాషనలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెప్పొచ్చు. 1999లో వచ్చిన ‘నీరం’ అనే మలయాళం చిత్రానికి ఇది రీమేక్. తరుణ్- రిచా జంటకి మంచి మార్కులు పడ్డాయి. అలాగే కోటి అందించిన సంగీతం ఈ చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి.
మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
7.35 cr
సీడెడ్
2.80 cr
ఉత్తరాంధ్ర
1.79 cr
ఈస్ట్
1.43 cr
వెస్ట్
1.27 cr
గుంటూరు
1.56 cr
కృష్ణా
1.33 cr
నెల్లూరు
0.86 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
18.39 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.81 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
19.20 cr
‘నువ్వే కావాలి’ చిత్రానికి కేవలం రూ.1.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ మాత్రమే జరిగింది. కానీ ఫుల్ రన్లో ఈ చిత్రం ఏకంగా రూ.19.20 కోట్లు షేర్ ను నమోదు చేసింది. డబ్బింగ్ కు సంబంధించిన కలెక్షన్ల వివరాలు కాకుండా ఈ లెక్కలు.అవి కూడా కలుపుకుంటే రూ.20 కోట్లు పైగానే ఉంటాయని ట్రేడ్ పండితుల అంచనా. అదే ఏడాది ఇండస్ట్రీ హిట్ అయిన ‘కలిసుందాం రా’ కలెక్షన్లను అధిగమించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ‘నువ్వేకావాలి’ చిత్రం. కానీ ఈ కలెక్షన్లను 2001 లో వచ్చిన బాలయ్య.. ‘నరసింహ నాయుడు’ చిత్రం బ్రేక్ చేసేసింది.