Nuvvu Naaku Nachav Collections: 23 ఏళ్ళ ‘నువ్వు నాకు నచ్చావ్’.. ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) ,ఆర్తి అగర్వాల్ (Aarthi Agarwal) జంటగా నటించిన ఆల్ టైం సూపర్ హిట్ మూవీ ‘నువ్వు నాకు నచ్చావ్’ (Nuvvu Naaku Nachav) . కె.విజయ భాస్కర్ (K. Vijaya Bhaskar) డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘శ్రీ స్రవంతి మూవీస్’ బ్యానర్ పై హీరో రామ్ పెదనాన్న శ్రీ స్రవంతి రవికిశోర్ (Sravanthi Ravi Kishore) నిర్మించారు. స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) ఈ చిత్రానికి సంభాషణలు అందించారు. సినిమాని ప్రేక్షకులు ఇప్పటికీ రిపీట్స్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు అంటే త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్ ఓ రీజన్ అని చెప్పాలి.

Nuvvu Naaku Nachav Collections

అలా అని మిగిలిన వాటిని తక్కువ చేయడానికి లేదు. సంగీతం, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ఆర్టిస్ట్..ల నటన.. ఇలా అన్నీ బాగా పండాయి. 2001 వ సంవత్సరం సెప్టెంబర్ 6న రిలీజ్ అయిన ఈ చిత్రం నేటితో 23 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద ‘నువ్వు నాకు నచ్చావ్’ (Nuvvu Naaku Nachav Collections) ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం రండి :

నైజాం 6.10 cr
సీడెడ్ 2.80 cr
ఉత్తరాంధ్ర 1.87 cr
ఈస్ట్ 1.36 cr
వెస్ట్ 1.13 cr
గుంటూరు 1.67 cr
కృష్ణా 1.27 cr
నెల్లూరు 0.70 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 16.90 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్  1.14 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 18.04 cr

‘నువ్వు నాకు నచ్చావ్’ (Nuvvu Naaku Nachav Collections) చిత్రం రూ.7.24 కోట్ల(షేర్) బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇక ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.18.04 కోట్లు కలెక్ట్ చేసి బయ్యర్లకు రూ.10.8 కోట్ల లాభాలను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘మనసంతా నువ్వే’ (Manasantha Nuvve) ‘స్టూడెంట్ నెంబర్ 1’ (Student No: 1) ‘ఆనందం’ ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ (Itlu Sravani Subramanyam) వంటి హిట్ సినిమాలు ఉన్నప్పటికీ ‘నువ్వు నాకు నచ్చావ్’ లాంగ్ రన్..ను ఆపలేకపోయాయి.

రిలీజ్ కి క్యూ కట్టిన సుహాస్ సినిమాలు

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus