పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఎప్పటిలానే భారీగా ఉన్నాయి. గ్లింప్స్ విడుదల తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి మరింత పెరిగింది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా, పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. కళకత్తా బ్యాక్‌డ్రాప్‌లో సుజిత్ తెరకెక్కిస్తోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో థమన్ సంగీతం అందిస్తున్నారు.
ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సినిమాకు సంబంధించి టీజర్ సంక్రాంతి పండుగకు విడుదల కానుందని టాక్. అయితే, ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైనప్పటికీ, టీమ్ ఇప్పుడు మరో సరికొత్త ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. ఆ ప్లాన్ ఏంటంటే ఓజీకు పార్ట్ 2 కూడా ఉండబోతుందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. “అలాంటోడు మళ్లీ వస్తున్నాడు” అనే ట్యాగ్‌లైన్‌తో మొదటి భాగానికి భారీ క్రేజ్ తెచ్చిన మేకర్స్, ఇప్పుడు సీక్వెల్‌తో కథను మరింత విస్తరించాలని భావిస్తున్నారు.
ప్రస్తుతం మొదటి భాగానికి అవసరమైన కొన్ని కీలక సన్నివేశాలను భారీ స్థాయిలో రూపొందించేందుకు విజయవాడ సమీపంలో స్పెషల్ సెట్లు నిర్మిస్తున్నారట. ఈ సెట్‌లను పార్ట్ 2 కోసం కూడా ఉపయోగించనున్నారని తెలుస్తోంది. సీక్వెల్ కథనంలో మరింత మాస్ ఎలిమెంట్స్‌ను జోడించి, పవన్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వాలనే లక్ష్యంతో టీమ్ పని చేస్తోంది.
సినిమా విడుదలపై ప్రస్తుతానికి జూలై 2025 టార్గెట్‌గా ఉండగా, పవన్ తర్వాత షెడ్యూల్‌కు డేట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. టీజర్ ద్వారా వచ్చే హైప్‌ను ఉపయోగించుకొని, మేకర్స్ సీక్వెల్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించవచ్చని కూడా చెబుతున్నారు. సీక్వెల్ కథను పవన్ ముందే విన్నట్లు, ఆయన స్పందనకు అనుగుణంగా పనులు కొనసాగనున్నట్లు టాక్. ఇక సీక్వెల్ ఫిక్స్ కావడం ద్వారా సినిమా స్కేల్ ఇంకా పెరుగుతుందని, మేకర్స్ ఇప్పటికే భారీ బడ్జెట్ ప్లాన్‌లో ఉన్నారని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.