మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన మొదటి సినిమా ‘ఒక్కడు’. 2003 జనవరి 15న సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ‘మురారి’ తర్వాత మహేష్ బాబు చేసిన సినిమాలు ఏవీ ఆడలేదు. ‘టక్కరి దొంగ’ ‘బాబీ’ వంటి సినిమాలు నిరాశపరిచాయి. అలాంటి టైంలో ‘ఒక్కడు’ వచ్చింది. రిలీజ్ కి ముందు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. పైగా అప్పటికి ఎన్టీఆర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. అతని ‘నాగ’ సినిమా రిలీజ్ ఉందని కొంచెం వెనక్కి జరిపి జనవరి 15న రిలీజ్ చేశారు ఎం.ఎస్.రాజు. పోటీగా అదే రోజున శ్రీకాంత్-వేణు ల ‘పెళ్ళాం ఊరెళితే’ రిలీజ్ అయ్యింది. ఇది అల్లు అరవింద్ నిర్మించిన సినిమా కాబట్టి.. అప్పటికి ఇది కూడా పెద్ద సినిమా.
Okkadu Collections
అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ‘ఒక్కడు’ భారీ వసూళ్లు సాధించింది. కమర్షియల్ సినిమాకి కొత్త డెఫినిషన్ చెప్పింది ‘ఒక్కడు’. ఒకసారి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘ఒక్కడు’ చిత్రానికి రూ.11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫైనల్ గా ఈ సినిమా రూ.24.73 కోట్లు( రీ రిలీజ్ తో కలుపుకుని) షేర్ ను రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా రూ.13.73 కోట్ల లాభాలను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మహేష్ కి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా ‘ఒక్కడు’ అనడంలో సందేహం లేదు..