భీమ్ ని ప్రేమించిన జెన్నీఫర్ లుక్ అదిరింది..!

RRR మూవీ టీమ్ నుంచి అఫీషియల్ గా హీరోయిన్ ఒలివీయా మోరిస్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్ ని తారక్ ఫ్యాన్స్ తెగ లైకులు చేస్తున్నారు. అంతేకాదు, తారక్ ని ఒలివీయాని పక్కపక్కన పెట్టి పోస్టర్ ని రీక్రియేట్ కూడా చేసేస్తున్నారు. ట్రిబుల్ ఆర్ యూనిట్ నుంచి ఒలివీయాకి హ్యాపీ బర్త్ డే చెప్తూ ఆమె లుక్ ని విడుదల చేశారు. ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చిన ఈ పోస్టర్ ని ట్యాగ్ చేస్తూ తారక్ సైతం హ్యాపీ బర్త్ డే జెన్నీఫర్ అంటూ విష్ చేశాడు.

ట్రిబుల్ ఆర్ సినిమాలో తారక్ కొమరంభీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భీమ్ ని ప్రేమించిన బ్రిటిష్ యువరాణిగా జెన్నీఫర్ పాత్రలో కనిపించబోతోంది ఒలివీయా మోరిస్. జెన్నీఫర్ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. అంతేకాదు, పోస్టర్ లో ఫ్రెష్ లుక్ తో చాలా అందంగా కనిపిస్తోంది. దీంతో తారక్ ఫ్యాన్స్ ఈ పోస్టర్ ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ పైన తెగ షేర్లు చేస్తున్నారు. 450కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ట్రిబుల్ ఆర్ సినిమాలో కొమరం భీమ్ కి జోడీగా జెన్నీఫర్ పాత్రలో ఒలివియా,

అలాగే అల్లూరి సీతారామరాజుకి జోడీగా సీత క్యారెక్టర్ లో అలియాభట్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిినిమాని 2021 అక్టోబర్ 13వ తేదిన విడుదల చేస్తున్నామని చిత్రయూనిట్ ప్రకటించింది. అజయ్ దేవగన్, శ్రీయ, సముద్రఖని సినిమాలో కీలకమైన పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus