‘బ్రోచేవారెవరురా’ (Brochevarevarura) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీ విష్ణు(Sree Vishnu), ప్రియదర్శి(Priyadarshi) , రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘ఓం భీమ్ బుష్'(Om Bheem Bush). ‘హుషారు’ (Husharu) ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి (Sree Harsha Konuganti) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘వి సెల్యులాయిడ్’, సునీల్ బలుసు కలిసి నిర్మించగా…, ‘యువి క్రియేషన్స్’ సంస్థ సమర్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్.. సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయం పై క్లారిటీ ఇచ్చేశాయి. మార్చి 22న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
శ్రీవిష్ణు ‘సామజవరగమన’ (Samajavaragamana) బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ సినిమాకి కూడా మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగింది అని చెప్పాలి. ఒకసారి థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ని గమనిస్తే :
నైజాం
2.50 cr
సీడెడ్
0.65 cr
ఉత్తరాంధ్ర
0.68 cr
ఈస్ట్
0.30 cr
వెస్ట్
0.25 cr
గుంటూరు
0.38 cr
కృష్ణా
0.52 cr
నెల్లూరు
0.28 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
5.56 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
1.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
6.56 cr (షేర్)
‘ఓం భీమ్ బుష్’ చిత్రానికి రూ.6.56 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పోటీగా క్రేజీ సినిమాలు లేవు కాబట్టి… పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.