ఆదిపురుష్ మూవీకి విలన్ ఎవరనే ప్రశ్నకు సైఫ్ అలీ ఖాన్ పేరు అందరూ చెప్పడం జరుగుతుంది. అయితే తమిళ క్రిటిక్స్ మాత్రం ఈ సినిమాకు ఓం రౌత్ అసలు విలన్ అని చెబుతున్నారు. రామాయణం సబ్జెక్ట్ ను ఎంచుకుని సినిమా తీస్తున్నారంటే ఏదో ఉహిస్తామని అయితే సినిమా మాత్రం అంచనాలకు భిన్నంగా మరో విధంగా ఉందని తమిళ క్రిటిక్స్ అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆదిపురుష్ స్టార్టింగ్ లోనే తన ఆలోచనలకు అనుగుణంగా ఈ సినిమాను తెరకెక్కించానని ఓం రౌత్ క్లారిటీ ఇచ్చినా ఈ సినిమాలో ఉన్న లోపాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆదిపురుష్ లో రావణాసురుడి పాత్రను తీర్చిదిద్దిన విధానంపై ఎన్ని విమర్శలు చేసినా తక్కువేనని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. రామాయణాన్ని ఈ స్థాయిలో వక్రీకరించింది ఓం రౌత్ మాత్రమేనని మరికొందరు చెబుతున్నారు. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ విషయంలో సైతం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు నెలల సమయం తీసుకున్నా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో నిరాశ తప్పలేదని ఫ్యాన్స్ చెబుతున్నారు.
“ఓం కమ్ టూ మై రూమ్” అంటూ కొంతమంది సెటైరికల్ గా చేస్తున్న కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. ఆదిపురుష్ టైటిల్ కూడా సినిమాకు ప్లస్ కాలేదని కొంతమంది చెబుతున్నారు. ఈ సినిమాకు జై శ్రీరామ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఓం రౌత్ మాత్రం ఈ సినిమా రిజల్ట్ విషయంలో సైలెంట్ గానే ఉన్నారు. (Om Raut) ఓం రౌత్ కు కొత్త ఆఫర్లు రావడం కష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే 75 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. నైజాంలో ఈ సినిమా ఏకంగా 13.70 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. ఆదిపురుష్ మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. ఆదివారం వరకు ఈ సినిమా కలెక్షన్లకు ఢోకా లేదని బోగట్టా.