Allu Arjun, Trivikram: ఆ దర్శకులకు బన్నీ మళ్లీ షాక్ ఇస్తారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు తెరకెక్కాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు హిట్లుగా నిలిస్తే అల వైకుంఠపురములో సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అల వైకుంఠపురములో సినిమా బన్నీకి క్లాస్ ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచింది. బన్నీ ప్రస్తుతం పుష్ప ది రూల్ లో నటిస్తున్నారు. పుష్ప ది రూల్ తర్వాత బన్నీ నటించే ప్రాజెక్ట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

బన్నీతో సినిమాను తెరకెక్కించాలని ఆసక్తి చూపిస్తున్న డైరెక్టర్ల జాబితాలో బోయపాటి శ్రీను, అట్లీ, కొరటాల శివ, వేణు శ్రీరామ్ మరి కొందరు డైరెక్టర్లు ఉన్నారు. మరోవైపు త్రివిక్రమ్ తర్వాత సినిమా మహేష్ బాబు హీరోగా ఫిక్స్ కాగా ఈ సినిమా తర్వాత ప్రాజెక్ట్ ఫిక్స్ కావాల్సి ఉంది. త్రివిక్రమ్ సినిమా చేస్తానని చెబితే బన్నీ నో చెప్పే ఛాన్స్ ఉండదు. అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకులను మెప్పించే సత్తా ఉన్న సినిమాలను మాత్రమే త్రివిక్రమ్ ఎక్కువగా తెరకెక్కిస్తారు.

త్రివిక్రమ్ ఎంట్రీ ఇస్తే మాత్రం బన్నీ ప్లాన్ మారిపోతుందని తెలుస్తోంది. మరి ఈ కాంబినేషన్ లో మరో సినిమా పట్టాలెక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు ఐకాన్ మూవీ ఆగిపోయినట్టే అని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అటు దిల్ రాజు ఇటు బన్నీ క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు పుష్ప ది రైజ్ సక్సెస్ తో బాలీవుడ్ లో బన్నీకి క్రేజ్ పెరగగా పుష్ప ది రూల్ సినిమాతో బన్నీ ఆ సక్సెస్ ను కంటిన్యూ చేస్తానని నమ్మకంతో ఉన్నారు.

తరువాత ప్రాజెక్టుల విషయంలో బన్నీ మనసులో ఏముందో మాత్రం తెలియలేదు. పుష్ప ది రైజ్ సక్సెస్ తో బన్నీ పారితోషికం అమాంతం పెరిగిందని బోగట్టా. తర్వాత సినిమాలతో కూడా బన్నీ విజయాలను అందుకుంటే మాత్రం బన్నీ రేంజ్ మరింత పెరగడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus