ఈ ఏడాది మే నెల 28వ తేదీన అఖండ, ఖిలాడీ సినిమాలు రిలీజవుతున్నట్టు ప్రకటనలు వెలువడిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆ తేదీకి ఈ రెండు సినిమాలు రిలీజ్ కాలేదు. దర్శకుడు బోయపాటి శ్రీను అఖండ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తుండగా ఖిలాడీ సినిమా కూడా దీపావళికే రిలీజ్ కానుందని తెలుస్తోంది. అఖండ, ఖిలాడీ సినిమాలు ఒకేరోజు విడుదలైతే ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమా నష్టపోవాల్సి ఉంటుంది.
ఈ రెండు సినిమాలలో అఖండపైనే ఎక్కువగా అంచనాలు నెలకొన్నాయి. అయితే గతంలో బాలయ్య, రవితేజ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సమయంలో రవితేజ ఎక్కువసార్లు ఘనవిజయాలను సొంతం చేసుకున్నారు. నవంబర్ నెల 4వ తేదీన అఖండ, ఖిలాడీ సినిమాలు రిలీజయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తుండటం గమనార్హం. ఐదోసారి బాలయ్య, రవితేజ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండటం గమనార్హం. క్రాక్ సక్సెస్ తో జోరుమీదున్న రవితేజ ఖిలాడీ సినిమాతో మరో సక్సెస్ ఖాతాలో చేరుతుందని భావిస్తున్నారు.
అఖండ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సాధిస్తానని బాలయ్య కూడా అనుకుంటున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను సైతం అఖండ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాల్సి ఉంది. దీపావళికి కొన్ని చిన్న సినిమాలు సైతం రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నాయి. బాలయ్య, రవితేజ సినిమాలు ఒకేసారి విడుదలైతే ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.