2020 ప్రారంభంలో సంక్రాంతి కానుకగా 3 సినిమాలు విడుదలైతే (‘దర్బార్’ డబ్బింగ్ తీసేస్తే).. అందులో రెండు సినిమాలైన ‘అల వైకుంఠపురములో’ అలాగే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు రూ.200 కోట్ల గ్రాస్ చొప్పున.. ఫైనల్ గా రూ.400 కోట్ల పైనే గ్రాస్ వసూళ్ళను రాబట్టి ట్రేడ్ కు సైతం షాకిచ్చింది. దీంతో పరభాషా సినీ ఇండస్ట్రీలు కూడా షాకయ్యాయి. దాంతో ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి బడా చిత్రాన్ని సంక్రాంతి కానుక గానే విడుదల చేస్తేనే బెటర్ అని.. రాజమౌళి కూడా డిసైడ్ అయ్యాడు. కానీ కరోనా ఎంట్రీ ఇచ్చి అందరి ప్లానింగ్స్ ను మార్చేసింది. విడుదల కావాల్సిన సినిమాలు ఆగిపోయాయి. షూటింగ్ దశలో ఉన్న చాలా సినిమాలు కూడా ఆగిపోయాయి.
సినిమా పైనే ఆధారపడి బ్రతుకుతున్న వారందరూ ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే 2020 డిసెంబర్ 25నుండీ థియేటర్లు తెరుచుకున్నాయి. జనాలు బాగానే రావడం మొదలుపెట్టారు.2021 ఇప్పటివరకూ విడుదలైన సినిమాలను జనాలు బాగానే యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు.పరభాషా పరిశ్రమలు కూడా టాలీవుడ్ ను చూసి షాకయ్యాయి. అంతా బానే ఉంది అనుకున్న టైములో ఇప్పుడు మరోసారి లాక్ డౌన్ రాబోతుంది అనే వార్త టాలీవుడ్ ను తెగ టెన్షన్ పెడుతుంది. కరోనాకి వ్యాక్సిన్ వచ్చినా.. అది పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా పెరిగినా తెలుగు రాష్ట్రాల్లో ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం లేదు.
మరో వైపు మహారాష్ట్ర వంటి కొన్ని చోట్ల కరోనా మళ్ళీ భీభత్సం సృష్టిస్తుంది. అందుకే కొన్ని చోట్ల మళ్ళీ లాక్ డౌన్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు. కేరళ బోర్డర్ లోని అన్ని రహదారులను కర్ణాటక మూసివేసింది. ఈ టైములో మళ్ళీ షూటింగ్లకు అంతరాయం ఏర్పడుతుందేమో అని కొన్ని సినిమా యూనిట్లు సాధ్యమైనంత తొందరగా షూటింగ్లను ఫినిష్ చెయ్యాలని భావిస్తున్నారట. విడుదల తేదీల సంగతి పక్కన పెట్టి.. ముందు షూటింగ్ లను ఫినిష్ చేస్తే ఓటిటిల్లో అయినా రిలీజ్ చేసుకోవచ్చు అని వారు డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.