మహేష్ 28వ మూవీ త్రివిక్రమ్ తో అంటున్నారే..!

సూపర్ స్టార్ మహేష్ సంక్రాంతి చిత్రం సరిలేరు నీకెవ్వరు తో ఓ భారీ హిట్ పొందారు. సరిలేరు నీకెవ్వరు మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించడంతో పాటు, ఆల్ టైం టాప్ టాలీవుడ్ గ్రాస్ సాధించిన చిత్రాలలో 4వ స్థానంలో నిలిచింది. దర్శకుడు అనిల్ రావిపూడి అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ప్రస్తుతం మహేష్ కుటుంబంతో కలిసి అమెరికాలో జాలీ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. రెండు నెలలకు పైగా కొనసాగనున్న ఈ లాంగ్ టూర్ ముగిసిన తరువాత మే నుండి దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. ఐతే ఈ చిత్రం తరువాత మహేష్ చేయనున్న చిత్రంపై ఆసక్తికర వార్త బయటికి వచ్చింది.

వంశీ పైడిపల్లి మూవీ తరువాత మహేష్ తన 28వ చిత్రం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తారట. వరుస సినిమాలు చేస్తున్న మహేష్ త్రివిక్రమ్ తో మూవీని కూడా ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం కలదని తెలుస్తుంది. మరీ ఇదే కనుక నిజం అయితే మరో క్రేజీ ప్రాజెక్ట్ మహేష్ ఖాతాలో చేరినట్లే. గతంలో మహేష్-త్రివిక్రమ్ అతడు, ఖలేజా వంటి చిత్రాలకు కలిసి పనిచేశారు. అతడు ఆల్ టైం ఫేవరెట్ మూవీగా నిలువగా, ఖలేజా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఐతే ఖలేజా సినిమాలో మహేష్ మేనరిజం, కామెడీ టైమింగ్ కి మంచి మార్కులు పడ్డాయి. ఒకప్పుడు మంచి మిత్రులుగా ఉన్న మహేష్ త్రివిక్రమ్ మధ్య గ్యాప్ పెరిగింది అనే ప్రచారం కూడా జరిగింది. ఏది ఏమైనా మళ్ళీ వీరిద్దరూ కలిసి సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus