మరో క్రేజీ కాంబోకి రంగం సిద్ధం..?

రాజమౌళితో చేసిన ‘ఈగ’ సినిమా హీరో నాని కెరీర్ ను చాలా వరకూ కుదిపేసిందనే చెప్పాలి. నిజానికి ఆ చిత్రంలో నాని పాత్ర 20 నిమిషాల వరకే ఉంటుంది. కానీ ఆ పాత్ర చుట్టూనే సినిమా కథ మొత్తం నడుస్తుంది. రాజమౌళితో ఏ హీరో సినిమా చేసినా.. ఆ హీరో తరువాతి సినిమా పెద్ద ప్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ ఉంది. అందుకు తగినట్టుగానే .. ‘ఈగ’ తరువాత నాని నటించిన సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యాయి.

ఆ టైములో డైరెక్టర్ మారుతీ.. ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆదుకున్నాడు. ఆ సినిమాలో కథ ఎలా ఉన్నా నానిదే వన్ మ్యాన్ షో. ఈ సినిమా నానిని ఫ్లాప్స్ నుండీ బయటపడేయడంతో పాటు అతనికి స్టార్ ఇమేజ్ ను కూడా తెచ్చిపెట్టింది. ఇంకో రకంగా చెప్పాలి అంటే.. ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం నానికి లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే మళ్ళీ నాని – మారుతీ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందా అని.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇన్నాళ్లకు వారి ఎదురుచూపులు ఫలించాయని తెలుస్తుంది.దర్శకుడు మారుతీ.. నాని కోసం ఓ మంచి స్క్రిప్ట్ ను రెడీ చేశాడట. ఇటీవల నానికి ఫోన్ చేసిన మారుతీ ఆ స్క్రిప్ట్ ను వినిపించగా… అది నచ్చడంతో నాని వెంటనే ఓకే చేసేశాడని సమాచారం. ప్రస్తుతం నాని ‘టక్ జగదీష్’ ‘శ్యామ్ సింగ రాయ’ ప్రాజెక్టు లతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తయ్యాక నాని- మారుతీ ల ప్రాజెక్టు ఉండే అవకాశం ఉందని సమాచారం.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus