నాగవంశీకి 2025 కలిసి రావడం లేదు.ఈ ఏడాది ముందుగా ఇతని నిర్మాణంలో ‘డాకు మహారాజ్’ సినిమా వచ్చింది. దానికి హిట్ టాక్ వచ్చింది. కానీ బ్రేక్ ఈవెన్ కాలేదు. అటు తర్వాత ‘మ్యాడ్ స్క్వేర్’ వచ్చింది. ఆ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ… కలెక్షన్స్ బాగానే వచ్చాయి. కానీ కంటెంట్ పరంగా ఫుల్ మార్కులు వేయించుకున్న సినిమాగా నిలవలేకపోయింది. ఇక అటు తర్వాత వచ్చిన ‘కింగ్డమ్’ కూడా ప్లాప్ అయ్యింది.
డిస్ట్రిబ్యూటర్ గా రిలీజ్ చేసిన ‘రెట్రో’ ‘వార్ 2’ సినిమాలు కూడా పెద్ద డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. ‘కొత్త లోక’ హిట్టైనా దానికి ఎక్కువ లాభాలు అయితే నాగవంశీకి మిగిలింది లేదు. ఎందుకంటే ఆ సినిమాని షేరింగ్ బేస్ పై రిలీజ్ చేయడం అలాగే సరైన విధంగా ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల నాగవంశీ క్యాష్ చేసుకోలేకపోయారు. ఇక తర్వాత ‘మాస్ జాతర’ని రిలీజ్ చేశారు. రవితేజ 75 వ సినిమాగా అంటే ల్యాండ్ మార్క్ మూవీగా ‘మాస్ జాతర’ రిలీజ్ అయ్యింది.
ఈ సినిమాకి కూడా సరైన విధంగా ప్రమోషన్ చేయలేదు. చాలా మందికి ‘మాస్ జాతర’ రిలీజ్ అయినట్టు కూడా తెలీదు అంటే ప్రమోషన్స్ ఎంత వీక్ గా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక తొలిరోజు ‘మాస్ జాతర’ కి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ పోటీగా ‘బాహుబలి ది ఎపిక్’ ఉండటం వల్ల వసూళ్లు సరైన రేంజ్లో రాలేదు. ఇదే సినిమాని ముందుగా అనౌన్స్ చేసిన డేట్ కి అంటే ఆగస్టు 27 కి వినాయక చవితి కానుకగా రిలీజ్ చేసి ఉంటే.. టాక్ తో సంబంధం లేకుండా లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకునే అవకాశం ఉండేది.
ఓ పెద్ద హీరో సినిమా రిలీజ్..కి సరైన ప్లానింగ్ వేసుకోకపోవడం ముమ్మాటికీ నాగవంశీ తప్పే అని చెప్పాలి. పోనీ 2వ వీకెండ్ కు సరైన సినిమాలు లేవు. కనీసం పోస్ట్ రిలీజ్లో అయినా సినిమాని ప్రమోట్ చేసి ఉంటే.. కచ్చితంగా 2వ వీకెండ్ ను అయినా క్యాష్ చేసుకునేది. ఇక నెక్స్ట్ సినిమాల విషయంలో అయినా నాగవంశీ ఈ తప్పులు చేయకుండా ఉంటే బాగుంటుంది.