సాధారణంగా టాలీవుడ్లో హీరోలు వైవిధ్యమైన సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఎందుకంటే మన హీరోలు ప్రయోగాత్మక సినిమాల్లో నటిస్తే.. బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ సంగతి పక్కన పెట్టేస్తే ముందుగా ప్రేక్షకుల నుండి అప్రిసియేషన్ కూడా ఉండదు అనేది అందరి మాట. ఈ విషయం చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ తన ఇమేజ్ కి భిన్నంగా ‘తీన్ మార్’ ‘పంజా’ వంటి వైవిధ్యమైన సినిమాలు చేస్తే చప్పట్లు కొట్టిన వాళ్లు చాలా తక్కువ. మహేష్ బాబు ‘ఖలేజా’ ‘1 నేనొక్కడినే’ ‘స్పైడర్’ వంటి సినిమాలు చేస్తే మొదట ప్రశంసించిన వాళ్ళ కంటే విమర్శించిన వాళ్ల సంఖ్యే ఎక్కువ.
రాంచరణ్ ‘ఆరెంజ్’ విషయంలో కూడా ఇదే రిపీట్ అయ్యింది. అంతే కాదు రవితేజ వంటి హీరోలు కూడా వారి ఇమేజ్ కి భిన్నంగా ‘నా ఆటోగ్రాఫ్’ స్వీట్ మెమోరీస్’ ‘నేనింతే’ వంటి సినిమాలు చేసినా వారికి సక్సెస్ దక్కింది లేదు. కొన్నాళ్ళు పోయాక టీవీల్లో, యూట్యూబ్ వంటి మాధ్యమాల్లో చూసి ఈ సినిమాలు బాగానే ఉన్నాయే అని జాలి పడ్డారు కానీ, థియేటర్లలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా వెళ్లి చూడటానికి ప్రేక్షకులు ముందడుగు వేయలేదు.
టాలీవుడ్ హీరోలు అందుకే చాలా వరకు సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు. వైవిధ్యం అనే రూటుకి దూరంగా ఉండాలని ఎక్కువగా ఫిక్స్ అయినట్లు కనిపిస్తారు. అయితే నాని మాత్రం… ఇవేవీ పట్టించుకోకుండా వైవిధ్యమైన స్క్రిప్ట్స్ ని ఎంపిక చేసుకోవడమే కాకుండా సక్సెస్ లు కూడా అందుకుంటూ ఉండటం చెప్పుకోదగ్గ విషయం. ‘దసరా’ వంటి రా అండ్ రస్టిక్ మూవీ చేసిన నాని.. ఆ సినిమాతో మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు.
ఆ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్ లో కూడా చేరాడు. అలా అని మూస ధోరణిలో పడిపోకూడదు అని ‘హాయ్ నాన్న’ చేశాడు నాని. ఈ సినిమా చూశాక నాని ‘దసరా’ చేశాడు అంటే జీర్ణించుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. అసలు ఏ ధైర్యంతో నాని ఈ సినిమా చేశాడు అనే డౌట్లు కూడా వస్తాయి. అయినా తన నమ్మకమే గెలిచింది.
మొదటి రోజు స్లోగా అనిపించిన (Hi Nanna) ‘హాయ్ నాన్న’ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్, రెండో రోజు నుండి మెరుగుపడింది. ఈ సినిమాతో ప్రేక్షకులు నానిని ఎలాంటి పాత్రల్లో అయినా ఓన్ చేసుకుంటారు అనే విషయం కూడా ప్రూవ్ అయ్యింది. అలాగే తెలుగు హీరోలు వైవిధ్యమైన కథలు చేయడానికి ఇష్టపడరు అనే విమర్శలకి కూడా చెక్ పెట్టేలా చేశాడు నాని అని కూడా చెప్పొచ్చు.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!