#NTR30: కొరటాల సినిమా టింకర్లు ఇంకా అవ్వలేదా..!

Advertisement

ఒక్క సినిమా పరాజయం దర్శకుడిని అంతగా డిఫెన్స్‌ జోన్‌లోకి పడేస్తుందా? కొరటాల శివను చూస్తే అవుననే అనిపిస్తోంది. సందేశం+ మాస్‌ అంశాలను మేళవిస్తూ ఇన్నాళ్లూ సినిమాలు చేసి విజయం అందించిన కొరటాల శివ ఇటీవల ‘ఆచార్య’ రూపంలో డిజాస్టర్‌ అందుకున్నారు. ఆ పరాజయం ఇప్పుడు ఆయన్ను డిఫెన్స్‌లోకి పంపేసింది అని చెబుతున్నారు. అందుకే ఎన్టీఆర్ సినిమా ఆలస్యమవుతోందని టాక్‌. ఇప్పుడు ఆ లేట్‌ మరికొన్నాళ్లు పెరిగింది అని చెబుతున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ విడుదలైన వెంటనే కొరటాల శివ సినిమా ఉంటుందని తొలుత వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో భాగంగా తారక్‌, కొరటాల ఇదే మాట చెప్పారు. జూన్‌లోనే సినిమా స్టార్ట్‌ చేస్తాం అని కూడా అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అలా కనిపించడం లేదు. జూన్‌లో సినిమా షూటింగ్‌ మొదలయ్యేలా కనిపించడం లేదు. అంతేకాదు జులైలో కూడా సినిమా స్టార్ట్‌ చేస్తారా? లేదా అనేది చెప్పలేం అంటున్నారు. కారణం కథలో ఇంకా కొన్ని మార్పులు అవసరం అనుకోవడమేనట.

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలని ఎన్టీఆర్ ఎప్పుడో డిసైడ్ అయ్యాడు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ మరో రెండు నెలలు విశ్రాంతి తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. సినిమా కోసం తారక్‌ మేకోవర్ ఇంకా పూర్తవ్వలేదని, అందుకే ఆలస్యమని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన గడ్డం పెంచుతున్నారట. సినిమాకు అవసరమైనపట్లు గుబురు గడ్డంతో కనిపించాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలని చెబుతున్నారు.

అలాగే స్టూడెంట్‌ లీడర్‌గా తారక్‌ కనిపించడానికి.. ఫిట్‌గా మారబోతున్నారట. బాడీని మరికాస్త యంగ్‌ షేప్‌లోకి మార్చడానికి జిమ్‌తో కసరత్తులు చేస్తున్నాడట. దీంతో ఆలస్యం అంటున్నారు. మరోవైపు సినిమా కథలో తారక్‌ సూచించిన మార్పులు చేయడానికి ఇంకొన్నాళ్లు పడుతుందని అందుకే ఆలస్యమవుతోందని చెబుతున్నారు. ఈ రెండింటిలో ఏది నిజం అనేది తెలియదు కానీ, సినిమా షూటింగ్‌ ప్రారంభం అయితే ఆలస్యమవుతుంది అని తెలుస్తోంది. అన్నట్లు ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు అనేది ఇంకా ఫైనల్‌ కాలేదు. సాయిపల్లవి అని రీసెంట్‌గా పుకార్లు వచ్చాయి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus