Poonam Kaur: పూనమ్‌ తన కష్టాన్ని ఇప్పుడెవరికి చెబుతుందో?

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల ప్రచారం జరుగుతుండగా… ఎవరికి నచ్చినవారికి వారు సపోర్టు చేశారు. అదే సమయంలో మరో టాపిక్‌ వచ్చి… రంగంలోకి నటి పూనమ్‌ కౌర్‌ వచ్చింది. గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో వినిపిస్తున్న పుకార్లలో ఆమె కూడా ఉంది. సినిమాలకు సంబంధించిన స్టార్‌ ఒకాయను ఆమెను మోసం చేశాడని అంటుంటారు. అదే మాట పోసాని కృష్ణమురళి కూడా చెప్పారు. అయితే నాయిక పేరు చెప్పలేదు. దాంతో మళ్లీ చర్చ వచ్చింది.

అదే సమయంలో పూనమ్‌ కౌర్‌ స్పందిస్తూ… వచ్చే ఎన్నికల్లో తన మద్దతు ప్రకాశ్‌రాజ్‌కే అని ప్రకటించారు. దీంతో ఇష్యూ మరోట్విస్ట్‌ తీసుకుంది. దాని వెనుక కూడా ఓ కారణం ఉంది. మద్దతు ట్వీట్‌ చేస్తూ… తనకు జరిగిన అన్యాయం, కష్టం గురించి ‘మా’ అధ్యక్షుడిగా ప్రకాశ్‌రాజ్‌ గెలిచాక తనకు చెప్పుకుంటానని, అప్పుడైనా తన కష్టం తీరుతుంది అని అనుకుంటున్నాను అని చెప్పింది పూనమ్‌. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.

‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ గెలిస్తే… పూనమ్‌ కౌర్‌ విషయంలో ఓ క్లారిటీ వస్తుందని చాలామంది అనుకున్నారు. మాకు తెలిసి పూనమ్‌ కూడా అదే అనుకున్నట్లుంది. కానీ ఇప్పుడు మంచు విష్ణు ఇప్పుడు అధ్యక్షుడయ్యారు. దీంతో పూనమ్ కౌర్‌ విషయంలో మళ్లీ కోల్డ్‌ స్టోరేజీలోకి వెళ్లినట్లేనా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. చూద్దాం పూనమ్‌ ఆలోచన ఎలా ఉందో?

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus