“నాకు కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది” అనే తీరులో పవన్ కళ్యాణ్ ఉంటే.. నాకు కొంచెం తిక్కుంది.. దానికి లెక్కేలేదు..” అనేది రామ్ గోపాల్ వర్మ తీరు. ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఆయనకే తెలియదు. కాపు కాసే శక్తి పవన్ అంటూ ప్రశంసించింది అతనే… అలాగే పవన్ నాయకుడిగా పనికిరాడని విమర్శించింది అతనే. అప్పట్లో అతనై మాటలపై దుమారం రేగడంతో.. కొంతకాలంగా పవన్ మీద మాత్రమే కాదు, మెగా ఫ్యామిలీ హీరోలపై కామెంట్స్ చేయలేదు. రీసెంట్ గా పవన్ పై వర్మ ప్రశంసల జల్లు కురిపించారు. ” ఇప్పుడే పవన్ కళ్యాణ్ లేటెస్ట్ స్పీచ్ చూశాను. ఎంతో థ్రిల్ కు గురయ్యాను. పవన్ తన పై వచ్చిన రూమర్ల గురించి స్పందించిన విధానం అద్భుతం. ఈ విషయంలోనాకు పవన్ లోని నిజాయితీ నచ్చింది.
ఏమాత్రం సిగ్గు పడకుండా, ఏ విషయాలను దాచకుండా పవన్ వ్యవహరించిన తీరు అమోఘం” అంటూ వర్మ అభినందించారు. అంతేకాదు భవిష్యత్ మీద పవన్ కు పూర్తి క్లారిటీ ఉందన్నారు. తాను గతంలో పవన్ పై తొందరపడి పలు కామెంట్స్ చేశానని, ఇది తనకొక గుణపాఠమని వర్మ తన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. అంతేకాదు పవన్ గొప్ప నాయకుడు అవుతాడని చెప్పారు. సడన్ గా వర్మ యూ టర్న్ తీసుకోవడంపై అందరూ ఆశ్చర్య పోతున్నారు. పవన్ పై ఇలాగే ప్రశంసలు కురిపిస్తాడా ? లేకుండా విమర్శలు గుప్పిస్తాడా? తెలియక పవన్ ఫ్యాన్స్ మౌనంగా ఉన్నారు.