Bigg Boss 5 Telugu: ఈ వారం రవి కెప్టెన్ ఎలా అయ్యాడో తెలుసా..?

  • November 12, 2021 / 11:39 AM IST

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం బిబి హోటల్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా హౌస్ కీపింగ్ లో జాబ్ పొగొట్టుకున్న రవి ఎలాగైనా సరే హోటల్ లో తిరిగి స్థానం సంపాదించాలని అనుకుంటాడు. అంతేకాదు, చెఫ్ అండ్ వెయిటర్స్ ఇచ్చే సర్వీసులని చెడగొట్టడమే ఇతడి లక్ష్యం. ఇది రవికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్. ఈ సీక్రెట్ టాస్క్ ని దిగ్విజయంగా రవి ఫినిష్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. అందుకే, నేరుగా కెప్టెన్సీ పోటీదారుడు అయ్యాడు. ఇక్కడే రవితో పాటుగా సిరి, సన్నీ, ఆర్జే కాజల్ కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు.

నిజానికి హోటల్ టాస్క్ లో అతిథుల టీమ్ గెలిచినట్లుగా సమాచారం తెలుస్తోంది. అందుకే అతిథుల టీమ్ నుంచీ ఉన్నవారిని కెప్టెన్సీ పోటీదారులుగా హౌస్ మేట్స్ ఎంచుకోవాలి.ఇక్కడ అతిథులుగా వచ్చినవాళ్లలో మానస్, పింకీ, సన్నీ, సిరి, కాజల్ ఉన్నారు. వీరిలో నుంచీ మేనేజర్ అయిన అనీమాస్టర్ ఇద్దరు వరెస్ట్ పెర్ఫామర్స్ ని ఎంచుకోవాల్సిరాగా పింకీ ఇంకా మానస్ పేర్లు చెప్తుంది. ఇది ప్రమోలో క్లియర్ గా చూపించారు. దీంతో మానస్ అండ్ పింకీ కెప్టెన్సీ రేస్ నుంచీ తప్పుకున్నారు.

సీక్రెట్ టాస్క్ విజయవంతంగా చేసిన రవి నేరుగా అర్హతని సాధించాడు కాబట్టి, ఇక మిగిలిని ముగ్గురు రవితో పోటీపడినట్లుగా తెలుస్తోంది. ఇక కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ సపోర్ట్ తో రవి ఈవారం కెప్టెన్ అయ్యాడు. శ్రీరామ్, షణ్ముక్, అనీమాస్టర్, పింకీ రవిని సపోర్ట్ చేస్తూనే వచ్చారు. వీరందరూ కూడా కెప్టెన్సీ పోటీదారులు కాదు కాబట్టి రవికి సపోర్టింగ్ గా నిలిచారు. మరోవైపు మానస్ ఒక్కడే సన్నీవైపు నిలిచినట్లుగా తెలుస్తోంది. కాబట్టి రవి ఈవారం కెప్టెన్ ఈజీగా అవ్వగలిగాడు అని చెప్తున్నారు. గతవారమే కెప్టెన్ అవ్వాల్సిన రవి మిస్ అయ్యాడు. ఈవారం ఎట్టకేలకి ఫస్ట్ టైమ్ ఇంటి కెప్టెన్ అయ్యాడు రవి. అదీ మేటర్.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus